అది అమ్మఒడి కాదు మమ్మీ ఒడి

అది అమ్మఒడి కాదు మమ్మీ ఒడి

అమ్మ ఒడి పథకానికి  మమ్మీ ఒడి పథకం అనే పేరు పెట్టాలన్నారు తులసి రెడ్డి. అమ్మ అనే  పదాన్ని ఉచ్చరించే అర్హత రాష్ట్ర ప్రభుత్వానికి లేదన్నారు. అమ్మ భాష అయినటువంటి మాతృ భాషను హత్య చేసిన ఈ ప్రభుత్వానికి అమ్మ అనే పదాన్ని ఉచ్చరించే అర్హత లేదన్నారు. అమ్మ ఒడి పథకానికి సంక్షేమ నిధులు మళ్లించి ఆర్భాటంగా చెప్పుకోవడం విడ్డూరంగా  ఉందన్నారు. అమ్మ ఒడి పథకానికి  పలు శాఖల నుంచి రూ. 6108 కోట్ల దారి మళ్లించారన్నారు.  సంక్షేమ శాఖల నుంచి అమ్మ ఒడి పథకానికి నిధులు డైవర్ట్ చేయడం సరికాదన్నారు. నారాయణ, చైతన్య లాంటి కార్పొరేట్ స్కూళ్లలో చదివే విద్యార్థులకు అమ్మఒడి పథకం కింద డబ్బులివ్వడం న్యాయమా అని ప్రశ్నించారు.