మూసీ నది  ప్రక్షాళన ఆగదు : ఎమ్మెల్యే సామేల్ 

మూసీ నది  ప్రక్షాళన ఆగదు : ఎమ్మెల్యే సామేల్ 
  • తుంగతుర్తి ఎమ్మెల్యే సామేల్ 

హైదరాబాద్, వెలుగు: ఎవరూ అడ్డుపడినా మూసీ ప్రక్షాళన ఆగదని తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్ స్పష్టం చేశారు. హైదరాబాద్, రంగారెడ్డి, నల్గొండ జిల్లాల  ప్రజల మేలు కోసమే సీఎం రేవంత్ రెడ్డి మూసీ ప్రక్షాళన చేపట్టారని వెల్లడించారు. మంగళవారం ఆయన  సీఎల్పీలో మీడియాతో మాట్లాడారు.  వేలాది ఎకరాల్లో మూసీ నీళ్లతో పంటలు పండుతున్నాయని తెలిపారు. మూసీ ప్రక్షా ళనపై కేటీఆర్, హరీశ్ రావు ఎగిరెగిరి పడుతున్నారని మండిపడ్డారు.

అధికారంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ మూసీని పట్టించుకోలేదని ఆరోపించారు. తమ ప్రభుత్వం మంచి చేస్తుంటే అడ్డుపడుతున్నారని ఫైర్ అయ్యారు. రేవంత్ రెడ్డికి మంచి పేరు వస్తుందన్న భయంతోనే అడ్డంకులు సృష్టిస్తున్నారని చెప్పారు. రేవంత్ రెడ్డి చేసే పనులు చూసి కేటీఆర్, హరీశ్ రావులకు నిద్ర పట్టడం లేదని తెలిపారు. గత బీఆర్ఎస్ సర్కార్  మల్లన్న సాగర్ లో ఎన్ని భూములు, ఎన్ని గ్రామాలను ముంచిందో అందరికీ  తెలుసన్నారు. అధికారంలో ఉన్నప్పుడు మూసీలో దోసెడు మన్ను  తీయని కేటీఆర్.. ఇప్పుడు మతిలేని మాటలు మాట్లాడుతున్నారని సామేల్  పేర్కొన్నారు.