తెలంగాణ బ్యాక్‌‌డ్రాప్‌‌లో "తురుమ్ ఖాన్‌‌లు".. ఫుల్లు కామెడీ

తెలంగాణ బ్యాక్‌‌డ్రాప్‌‌లో "తురుమ్ ఖాన్‌‌లు".. ఫుల్లు కామెడీ

శ్రీరామ్ నిమ్మల హీరోగా శివకళ్యాణ్ దర్శకత్వంలో ఎండీ. ఆసిఫ్ జానీ నిర్మిస్తున్న చిత్రం ‘తురుమ్ ఖాన్‌‌లు’. షూటింగ్ పూర్తి చేసుకుని, పోస్ట్ ప్రొడక్షన్‌‌తో పాటు ప్రమోషన్స్ కూడా స్టార్ట్ చేశారు మేకర్స్. ‘రంగు రంగుల చిలక’ అంటూ సాగే మొదటి పాటను దర్శకుడు త్రినాథరావు నక్కిన రిలీజ్ చేశారు. 

అనంతరం ఆయన మాట్లాడుతూ ‘తెలంగాణ బ్యాక్‌‌డ్రాప్‌‌లో అందులోనూ  కామెడీ సినిమా రావడం సంతోషంగా ఉంది. పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నా’ అని అన్నారు.   ‘పల్లెటూరు రివెంజ్ కామెడీ జానర్‌‌‌‌లో మొదటిసారి మహబూబ్ నగర్ స్లాంగ్‌‌లో ఈ  చిత్రాన్ని  తెరకెక్కిస్తున్నాం’ అని దర్శక నిర్మాతలు చెప్పారు.