ఏఐతో జర్నలిజంలో విప్లవాత్మక మార్పులు : ఖాజా విరాహాత్ అలీ

ఏఐతో జర్నలిజంలో విప్లవాత్మక మార్పులు : ఖాజా విరాహాత్ అలీ
  • టీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షుడు ఖాజా విరాహాత్ అలీ 

గజ్వేల్, వెలుగు: ఆర్టిఫిషియల్​ ఇంటలిజెన్స్​(ఏఐ) రాకతో జర్నలిజంలో విప్లవాత్మక మార్పులు జరుగుతున్నాయని టీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షుడు ఖాజా విరాహాత్ అలీ అన్నారు. ఆదివారం సిద్దిపేట జిల్లా గజ్వేల్ లో  ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో స్థానిక మల్లారెడ్డి ఫంక్షన్​హాల్​లో జర్నలిస్టులకు ఏఐపై -నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. వక్తగా పాల్గొన్న సీనియర్​ జర్నలిస్టు, ఏఐ నిపుణుడు ఉడుముల సుధాకర్ రెడ్డి పాల్గొని అవగాహన కల్పించారు. 

విరాహాత్ అలీ మాట్లాడుతూ.. ఏఐ కత్తిలాంటిదని, దానితో మంచి చెడులు రెండూ అంటాయని జాగ్రత్తగా వాడుకోవాలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా గ్రామీణ  విలేకరులకు ఏఐపై అవగాహన కల్పిస్తున్నామన్నారు. అనంతరం సుధాకర్ ​రెడ్డి మాట్లాడుతూ.. మానవ మనుగడనే కొత్త మలుపు తిప్పుతున్న ఏఐతో మీడియా రంగంలోనూ ఎన్నో అద్భుతాలు సాధ్యమవుతాయన్నారు. చాట్​ జీపీటీ, జెమినాయ్, డీప్​ఫేక్, నోట్​బుక్​ ఎల్​ఎమ్, పర్​ఫ్లెక్సిటీ తదితర ఏఐ టూల్స్ ద్వారా జర్నలిస్టుల పని మరింత సులువవుతుందన్నారు. 

కానీ ఏఐని సక్రమంగా వినియోగించకపోతే తప్పుడు సమాచారం వ్యాప్తి చెందే ప్రమాదం ఉందని, జాగ్రత్తగా వ్యవహరించాలన్నారు. కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ సీనియర్​ సభ్యులు సురేందర్, కృపాకర్ రెడ్డి, మధుసూదన్ రెడ్డి, యాదగిరి, విజయరావు, ఎల్లం, కృష్ణ, చిన్న యాదగిరి, రమణారెడ్డి, కిరణ్, జగదీశ్, అశోక్, శ్రీనివాస్ రెడ్డి, శ్రీనివాస్, మునీర్, బాల్ నర్సయ్య పాల్గొన్నారు.