
బాలీవుడ్ టీవీ నటి 34 ఏళ్ల దివ్య భట్నాగర్ సోమవారం మృతి చెందారు. ఇటీవల కరోనా బారిన పడిన ఆమె ముంబైలోని సెవెన్‌హిల్స్ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటోంది. అయితే ఇవాళ(సోమవారం) తెల్లవారు జామున ఆమె పరిస్థితి విషమించడంతో డాక్టర్లు దివ్య భట్నాగర్‌కు వెంటిలేటర్‌పై చికిత్స అందించారు. అధిక రక్తపోటుతో పాటు కరోనా వైరస్ తో పోరాడి సోమవారం తుది శ్వాస విడిచారు. ఆమె మరణవార్తతో పలువురు టీవీ ప్రముఖులు దిగ్ర్భాంతి వ్యక్తం చేస్తూ సోషల్ మీడియా వేదికగా సంతాపం తెలుపుతున్నారు.