టీవీ నటికి కోవిడ్ పాజిటివ్.. ఇన్స్టా పోస్ట్లో భావోద్వేగం.. నా పరిస్థితి గతం కంటే ఇంకా దారుణం

టీవీ నటికి కోవిడ్ పాజిటివ్.. ఇన్స్టా పోస్ట్లో భావోద్వేగం.. నా పరిస్థితి గతం కంటే ఇంకా దారుణం

కోవిడ్ 19 మళ్లీ విజృభిస్తోంది. రోజు రోజుకు కొత్త కేసుల పెరిగిపోతున్నాయి. దేశంలో తాజా యాక్టివ్ కేసుల సంఖ్య 3వేల దాటిందని ఆరోగ్య శాఖ ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వం కూడా కోవిడ్ ను లైట్ తీసుకోవద్దని, జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. తాజాగా బాలీవుడ్ పాపులర్ టీవీ స్టార్  మహి విజ్ కు కరోనా సోకింది. ఈ విషయాన్ని తన ఇస్ స్టాగ్రామ్ పోస్ట్ ద్వారా వెల్లడించింది.

‘నాకు అస్వస్థత అనిపించి కోవిడ్ టెస్టు చేయించుకున్నా. పాజిటివ్ గా తేలింది. లక్షణాలు ఎక్కువగా లేకపోయినా.. అలసటగా ఉంది. దాంతో ఇంట్లోనే క్వారంటీన్ లో ఉన్నా. నా పిల్లలు అమ్మా అని ఏడుస్తుంటే వాళ్లను దగ్గరకు తీసుకోలేని పరిస్థితి ఉంది. లోలోపల కుంగిపోతున్నా. నా పరిస్థితి ఇంకొకరికి రాకూడదు. గతంలో కరోనా భారిన పడ్డా. ఇప్పుడు నా పరిస్థితి గతం కంటే ఇంకా దారుణంగా ఉంది. అందరూ జాగ్రత్తగా ఉండండి. మాస్క్ పెట్టుకోండి. సానిటైజర్ వాడండి’ అంటూ సెల్ఫీ వీడియో పోస్ట్ చేసింది.