టీవీ ఛానెల్ ఎడిటర్ అరెస్ట్.. నుహ్ హింసపై తప్పుదోవ పట్టించే పోస్ట్

టీవీ ఛానెల్ ఎడిటర్ అరెస్ట్.. నుహ్ హింసపై తప్పుదోవ పట్టించే పోస్ట్

హర్యానాలోని నుహ్, ఇతర జిల్లాల్లో ఇటీవల చోటుచేసుకున్న మత ఘర్షణలపై రెచ్చగొట్టే పోస్టులు చేశారనే ఆరోపణలపై హిందీ న్యూస్ ఛానెల్ ఎడిటర్‌ను ఆగస్టు 11న గురుగ్రామ్ పోలీసులు అరెస్టు చేశారు.

సుదర్శన్ న్యూస్ రెసిడెంట్ ఎడిటర్ ముఖేష్ కుమార్‌ను గురుగ్రామ్ సెక్టార్ 17లో అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. కుమార్‌ను కొందరు గూండాలు కిడ్నాప్ చేశారని ఛానెల్ మొదట చెప్పుకొచ్చింది. అయితే అతన్ని సైబర్ క్రైమ్ విభాగం అరెస్టు చేసినట్లు గురుగ్రామ్ పోలీసులు స్పష్టం చేశారు. జూలై 31న ముస్లింలు మెజారిటీగా ఉన్న నుహ్‌లో విశ్వహిందూ పరిషత్ (VHP) ఊరేగింపుపై కొందరు దాడి చేయడంతో జరిగిన ఘర్షణల్లో ఆరుగురు చనిపోయారు. మృతుల్లో ఇద్దరు హోంగార్డులు, ఒక మతాధికారి ఉన్నారు.

గురుగ్రామ్ పోలీస్ కమిషనర్ కు విదేశీ మీడియా సంస్థ కాల్ చేస్తోందని, మతపరమైన అల్లర్లకు సంబంధించి హిందువులపై చర్యలు తీసుకోవాలని ఒత్తిడి చేస్తోందని ఇటీవల  సంస్థ గురుగ్రామ్ పోలీస్ కమిషనర్ కళా రామచంద్రన్‌కు కాల్‌లు చేస్తోందని ఆయన ఆరోపించారు. ఈ పోస్టుపై స్పందించిన గురుగ్రామ్ పోలీసులు.. ఈ పోస్టు ప్రజలను తప్పుదోవ పట్టించేదిగా ఉందని ఆరోపిస్తూ.. ఐటీ చట్టంలోని సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.