లాక్ డౌన్ తో ఆగిపోయిన వెండితెర, బుల్లితెర షూటింగ్స్ జూన్ నెల చివరి నుంచి ప్రారంభం కానున్నాయి. అయితే ఈ షూటింగ్స్ కు కొన్ని షరతులు విధిస్తూ అనుమతి ఇస్తున్నట్లు ఫెడరేషన్ ఆఫ్ వెస్ట్రన్ ఇండియా సినీ ఎంప్లాయి (ఎఫ్‌వైసిఇ) అధ్యక్షుడు బీఎన్ తివారీ తెలిపారు.
షూటింగ్ లు ఆగిపోవడం వల్ల కార్మికులు నష్టపోతున్నారని, వారిని ఆదుకునేందుకు సీరియల్, ఎంటర్ టైన్ మెంట్ షో షూటింగ్స్ కు పర్మీషన్ ఇస్తున్నట్లు తివారీ చెప్పారు. దీంతో జూన్ నెల చివరి నుంచి బాలీవుడ్ లో ఏక్తా కపూర్ షోలు, కౌన్ బనేగా కరోడ్ పతి పరిమిత సిబ్బందితో షూటింగ్ ప్రారంభం కానున్నాయి. అయితే ఎఫ్ వైసీఇ నిబంధనల్ని నిర్మాతలు అంగీకరిస్తే షూటింగ్స్ ప్రారంభం అవుతాయి.
షూటింగ్స్ తిరిగి ప్రారంభించడానికి నిర్మాతలు కొన్ని షరతులకు అంగీకరించాల్సి ఉంటుందని ఎఫ్ వైసీఇ తెలిపింది.
మాస్క్ ధరించడం, శాని టైజర్‌ను ఎలా ఉపయోగించాలో ఎఫ్ వైసీఇ శిక్షణ ఇవ్వడం. ప్రతి సెట్లో ఒక ఎస్సై ఉంటారు. నిబంధనలకు అనుగుణంగా కార్మికులు వ్యవహరిస్తున్నారా లేదా అనే విషయాన్ని పర్యవేక్షిస్తారు. పూర్తిస్థాయిలో అందరూ మాస్క్ లు, శానిటైజర్లు వినియోగించే వరకు అక్కడే విధులు నిర్వహిస్తారు.
షూటింగ్ లో కరోనా వైరస్ కార్మికుడు మరణిస్తే అతని కుటుంబానికి నిర్మాత లేదా సదరు ఛానెల్ యాజమాన్యం రూ.50లక్షలు నష్టపరిహారం చెల్లించాల్సి ఉంటుంది. దీనికి తోడు వైద్య ఖర్చులు కూడా భరించాలి.
ప్రమాదవశాత్తు మరణించినవారికి నిర్మాతలు రూ .40-42 లక్షలు ఇస్తారు. కానీ ఫెడరేషన్ ఆఫ్ వెస్ట్రన్ ఇండియా సినీ ఎంప్లాయి నష్టపరిహారాన్ని రూ.50లక్షలకు పెంచింది.
షూటింగ్ , సెట్స్‌లో కనీసం 100 లేదా అంతకంటే ఎక్కువ మంది వ్యక్తులు ఉంటారు. కానీ, తాజా నిబంధనల ప్రకారం, 50 శాతం కార్మికులతో షూటింగ్ నిర్వహించాల్సి ఉంటుంది. వీటన్నింటికి నిర్మాతలు అంగీకరిస్తే షూటింగ్ లు ప్రారంభించుకోవచ్చని ఫెడరేషన్ ఆఫ్ వెస్ట్రన్ ఇండియా సినీ ఎంప్లాయి (ఎఫ్‌వైసిఇ) అధ్యక్షుడు బీఎన్ తివారీ అన్నారు.
