రవి ప్రకాష్ విచారణకు సహకరిస్తున్నారు: సీసీఎస్ పోలీసులు

రవి ప్రకాష్ విచారణకు సహకరిస్తున్నారు: సీసీఎస్ పోలీసులు

ఫోర్జరీ కేసులో టీవీ 9 మాజీ సీఈవో రవి ప్రకాష్  ఇవాళ సైబారబాద్ సీసీఎస్ పోలీసులు ఎదుట విచారణకు హాజరయ్యారు.  సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు పోలీసులు విచారిస్తున్నారు. ఈ సందర్భంగా సైబారబాద్ సైబర్ క్రైమ్ ఏసీీపీ నివాస్ మాట్లాడుతూ..విచారణ ఇంకా కొనసాగుతుందని రవి ప్రకాష్ విచారణకు సహకరిస్తున్నారని అన్నారు. రవిప్రకాష్ ను అరెస్ట్ చేస్తామా లేదా అనేది ఇప్పుడే  చెప్పలేమన్నారు.  సినీ నటుడు శివాజీ విచారణకు హాజరు కాలేదన్నారు. ఈ కేసులో ఎవరైనా విచారణకు హాజరు కాకుంటే  సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు ముందుకెళ్తామన్నారు.