విజయ్ సీఎం కాకపోతే జల్లికట్టు తరహాలో ఉద్యమిస్తాం : సోషల్ మీడియాలో జెన్ జీ పిలుపు

విజయ్ సీఎం కాకపోతే జల్లికట్టు తరహాలో ఉద్యమిస్తాం : సోషల్ మీడియాలో జెన్ జీ పిలుపు

తమిళనాడులో ఏం జరుగుతుంది బాసూ.. తమిళనాడులో విజయ్ సీఎం అవుతాడా లేదా.. విజయ్ పార్టీకి మద్దతు ఇచ్చేది ఎవరు ఇదే ఇప్పుడు అందరి నోట మాట.. సీఎంగా ప్రమాణ స్వీకారానికి అంతా సిద్ధం అనుకున్న టైంలో.. లెక్కల చిక్కుల్లో బ్రేక్ పడింది. ఈ విషయాన్ని జీర్ణించుకోలేకుండా ఉన్నారు తమిళనాడు యువత. 

రాత్రి నుంచి సోషల్ మీడియాలో విజయ్ కు అనూహ్యంగా మద్దతు పెరిగిపోయింది. జెన్ జీ అయితే రెచ్చిపోతున్నారు. జల్లికట్టు తరహాలో మా తఢాఖా చూపిస్తాం అంటూ పోస్టులు పెడుతున్నారు. 

చెన్నై సిటీలోని మెరీనా బీచ్ లో ఉద్యమం ప్రారంభిద్దామా.. పోరాటాం మొదలుపెడదామా అంటూ పోస్టులు పెడుతున్నారు జెన్ జీ కుర్రోళ్లు. 

డీఎంకే, అన్నాడీఎంకే పార్టీల తీరును దుమ్మెత్తిపోస్తున్నారు. విజయ్ సీఎం కాకుండా అడ్డుకుంటే మీ పార్టీల సంగతి తేలుస్తాం.. మీరు రోడ్లపై ఎలా తిరుగుతారో చూస్తాం అంటూ వార్నింగ్స్ ఇస్తున్నారు జెన్ జీ బ్యాచ్. 

సోషల్ మీడియాలో విజయ్ కు మద్దతుగా జెన్ జీ పోస్టులపై పోలీసులు అలర్ట్ అయ్యారు. మెరీనా బీచ్.. చెన్నై సిటీ వ్యాప్తంగా ఉన్న సముద్ర తీరంలో పోలీసులను మోహరించారు. ఎవరూ అటువైపు రాకుండా అడ్డుకుంటున్నారు. 

ఓ 10 మంది కుర్రోళ్లు వచ్చి.. నిరసనగా పోస్టులు పెట్టినా అది నిమిషాల్లో రాష్ట్రం మొత్తమే కాదు.. చెన్నై సిటీలోని కుర్రోళ్లు మొత్తం వచ్చినా వస్తారానే భయంతో ఉన్నారు పోలీసులు. ఈ క్రమంలోనే మెరీనా బీచ్ పరిసరాలపై నిఘా పెంచారు. ఎవర్నీ అనుమతించటం లేదు.