టీవీఎస్ నుంచి కింగ్​ డ్యూరామాక్స్​ ప్లస్​

టీవీఎస్ నుంచి కింగ్​ డ్యూరామాక్స్​ ప్లస్​

టీవీఎస్ మోటార్ కంపెనీ తన కొత్త త్రీ-వీలర్..   కింగ్​ డ్యూరామాక్స్​ ప్లస్​ను లాంచ్​ చేసింది. ఇది పెట్రోల్, సీఎన్​జీ వెర్షన్లలో అందుబాటులో ఉంటుంది. సీఎన్జీ వేరియంట్ ధర రూ.2,57,190 కాగా ,  పెట్రోల్ వేరియంట్ ధర రూ.2,35,552 (ఎక్స్-షోరూమ్, బెంగళూరు) అని కంపెనీ తెలిపింది. టీవీఎస్ కింగ్ డ్యురామాక్స్ ప్లస్​లో 225 సీసీ 4 -స్ట్రోక్ లిక్విడ్ కూల్డ్ సింగిల్ సిలిండర్ ఇంజన్‌‌‌‌‌‌‌‌ ఉంటుంది.  డ్యూయల్​ రేటెడ్​ ఫ్రంట్ ​సస్పెన్షన్​, విశాలమైన కేబిన్​, ఆల్​గేర్​ స్టార్ట్​ సిస్టమ్​, ట్యూబ్​లెస్​ టైర్లు వంటి ప్రత్యేకతలు ఉన్నాయి.