ట్విట్టర్ వార్: శత కోటి గొట్టంగాళ్లలో ఒక గొట్టంగాడివి

ట్విట్టర్ వార్: శత కోటి గొట్టంగాళ్లలో ఒక గొట్టంగాడివి

వైసీపీ ఎంపీ  విజయసాయి రెడ్డి  జనసేన నేత, సినీ నటుడు నాగబాబు మధ్య ట్విట్టర్లో మాటల యుద్ధం నడుస్తుంది. నువ్వెంతంటే నువ్వెంత అనే రేంజ్ లో ఒకరిపై ఒకరు  విమర్శలు చేసుకుంటున్నారు. ఏపీ ఎన్నికల కమిషనర్ ను నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ను తొలగించడం తో స్టార్ట్ అయిన ఈ వివాదం ఆగడం లేదు. కరోనా లాంటి విపత్కర సమయంలో రమేశ్ ను తొలగించి రాజకీయాలు మాట్లాడే అవకాశం కల్పించింది వైసీపీనే అని జనసేన అధినేత పవన్ బదులిచ్చారు. దీనిపై స్పందించిన  విజయసాయిరెడ్డి  అసలు రాజకీయాలు చేయడానికి పవన్ కు  గ్రౌండే లేదన్నారు. ఎక్కడో హైదరాబాద్ లో కూర్చుని తాను లేస్తే మనిషిని కాదనట్టుగా  పవన్ తీరు ఉందని ట్వీట్ చేశారు.

అయితే ఈ  వ్యాఖ్యలకు నాగబాబు బదులిస్తూ..‘ ఎదవ రాజకీయాలు చేయటానికి నీ లాంటి గుంటనక్కలున్న సంగతి తమకు తెలుసన్నారు.  2019 లో ఎన్నికలకు ముందు ఇద్దరి కామన్  ఫ్రెండ్ తో తన ఇంటికి వచ్చి పవన్ తో దోస్తీ కి రెడి అన్నమీ గుంట నక్కరాజకీయలు తనకు గుర్తున్నాయన్నారు . మీరు హాయిగా దొంగ లెక్కలు వేసుకొంటు,దోచుకుంటు బ్రతికెయ్యగలరని  తెలుసన్నారు.అవార్డ్స్ అందుకోగల పారిశ్రామిక వేత్తలని జైలు పాలు చేసింది తమరి ప్రతిభే కదా ? అని అన్నారు.

అదే రేంజ్ లో రీ కౌంటర్ ఇచ్చిన విజయసాయిరెడ్డి.. పావలా బ్యాచికి రోషం పొడుచుకొచ్చిందని.. సిన్మాలు, టీవీ షోలు చేసుకుంటూ పార్టీని గాలికొదిలినోళ్లకు రాజకీయాలెందుకు? అని అన్నారు. 2019లోతాము ఎవరితో పొత్తు పెట్టుకోలేదన్నారు. చిరంజీవి తమ్ముళ్లు కాకపోతే కుక్కలు కూడా మొరగవని అన్నారు.

దీనిక నాగబాబు గట్టిగానే బదులిచ్చారు. విజయసాయిరెడ్డి వైస్సార్ అడిటర్ కాకపోయివుంటే శతకోటి గొట్టంగాళ్లలో ఒక గొట్టంగాడని.. వదిలేసేవాడినంటూ ట్వీట్ చేశారు. విజయసాయిరెడ్డి లాంటి గొట్టంగాళ్ళు తనతో ట్వీట్ చేసే బదులు ,ఫ్యూచర్ లో జైల్లో ఏలా టైం పాస్ చెయ్యాలో అని ఒక డే టు డే షెడ్యూల్ వేసుకో, టైం కలిసి వస్తుందన్నారు.