ఓయూ ప్రొఫెసర్లకు పదోన్నతులు

ఓయూ ప్రొఫెసర్లకు పదోన్నతులు

విశ్వవిద్యాలయ చరిత్రలో తొలిసారి ప్రొఫెసర్లకు సీనియర్లుగా పదోన్నతులు కల్పిస్తూ ఉస్మానియా యూనివర్సిటీ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రొఫెసర్గా పదేళ్లకుపైగా అనుభవం, వారి పరిశోధనల ఆధారంగా ప్రమోషన్ ఇచ్చారు. సెలక్షన్ కమిటీ ఎంపిక చేసిన 26 మంది సీనియర్ ప్రొఫెసర్ల లిస్టుకు ఎగ్జిక్యూటివ్ కమిటీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా.. వారంతా వైస్ ఛాన్స్లర్ డి. రవీందర్ చేతుల మీదుగా ఉత్తర్వులు అందుకున్నారు. సీనియర్లుగా పదోన్నతి పొందిన వారిలో అత్యధికంగా 8 మంది ఇంజనీరింగ్ కళాశాలకు చెందిన ప్రొఫెసర్లు ఉన్నారు. బిజినెస్ మేనేజ్మెంట్, కామర్స్ విభాగం నుంచి నలుగురు చొప్పున, ఇంగ్లీష్, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ల నుంచి ఇద్దరు చొప్పున ప్రమోషన్ పొందారు. ఇక తెలుగు, ఫిజికల్ ఎడ్యుకేషన్, ఫిజిక్స్, టెక్నాలజీ,జువాలజీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ల నుంచి ఒక్కో ప్రొఫెసర్ సీనియర్ గా ప్రమోట్ అయ్యారు. ప్రమోషన్ పొందిన వారందరికి వీసీ శుభాకాంక్షలు తెలిపారు.

ఇంజనీరింగ్
రిజిస్ట్రార్ ప్రొఫెసర్ లక్ష్మీనారాయణ, ప్రొఫెసర్ వి. బసవరావు, ప్రొఫెసర్ చింతా సాయిలు, ప్రొఫెసర్ శ్రీరాం వెంకటేశ్,  ప్రొఫెసర్ వి. రమేష్ కుమార్,  ప్రొఫెసర్ ఎం.కుమార్, ప్రొఫెసర్ వి భిక్ష్మ, ప్రొఫెసర్ ఎ.కృష్ణయ్య 

బిజినెస్ మేనేజ్మెంట్
ప్రొఫెసర్ ఆర్. నాగేశ్వర్ రావు, ప్రొఫెసర్ పి. వెంకటయ్య, ప్రొఫెసర్ కె. జ్ఞాన చంద్రిక, ప్రొఫెసర్ మల్లికార్జున రెడ్డి 

కామర్స్ 
ప్రొఫెసర్ ప్రశాంత ఆత్మ, ప్రొఫెసర్ వి. ఉషా కిరణ్, ప్రొఫెసర్ డి.చెన్నప్ప, ప్రొఫెసర్ వి. అప్పారావు 

ఇంగ్లీష్ 
ప్రొఫెసర్ ఇ.సురేష్ కుమార్,  ప్రొఫెసర్ సి.మురళీకృష్ణ

ఎడ్యుకేషన్ 
ప్రొఫెసర్ ఎ.రామకృష్ణ, ప్రొఫెసర్ టి.మృణాళిని

తెలుగు 
ప్రొఫెసర్ వి. నిత్యానందరావు

ఫిజికల్ ఎడ్యుకేషన్ 
ప్రొఫెసర్  ప్రొఫెసర్ ఎల్.బి. లక్ష్మీకాంత్ రాథోడ్ 

ఫిజిక్స్ 
ప్రొఫెసర్ డి. కరుణసాగర్

టెక్నాలజీ 
ప్రొఫెసర్ కవితా వాఘ్రే

జువాలజీ 
ప్రొఫెసర్ ఎస్. జితేందర్ కుమార్ నాయక్

పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ 
ప్రొఫెసర్ ఆర్.లింబాద్రి