V6 News

కెమికల్ ​ట్యాంక్​లో పడి కవలలు మృతి

కెమికల్ ​ట్యాంక్​లో పడి కవలలు మృతి
  • జీడిమెట్లలో ఘటన

జీడిమెట్ల, వెలుగు: జీడిమెట్ల ఏరియాలోని ఓ ఫార్మా కంపెనీలో ఉన్న కెమికల్​ట్యాంక్​లో పడి ఇద్దరు కవల సోదరులు చనిపోయారు. మరొకరు గాయపడ్డారు. పోలీసుల కథనం ప్రకారం..జీడిమెట్ల ఇండస్ట్రియల్​ఎస్టేట్​లోని సబూరీ ఫార్మా ప్రైవేట్​ లిమిటెడ్​ కంపెనీ కొంతకాలంగా మూతపడి ఉంది. తిరిగి ప్రారంభించడానికి కొద్ది రోజులుగా రిపేర్లు చేస్తున్నారు. అంబేద్కర్​ కోనసీమ జిల్లా కాట్రేనికోన మండలం దొంతికూర గ్రామానికి చెందిన రామ్​(32) లక్ష్మణ్​(32) కవల సోదరులు.  వారు నాలుగు రోజులుగా కంపెనీలో ఫ్యాబ్రికేషన్​పనిచేస్తున్నారు. బుధవారం మధ్యాహ్నం కెమికల్​ట్యాంక్​ వద్ద పనిచేస్తుండగా రామ్..కెమికల్​ట్యాంక్​లో పడిపోయాడు. దీంతో అతడిని కాపాడేందుకు ప్రయత్నించిన లక్ష్మణ్​ కూడా అందులోనే పడి చనిపోయాడు. అక్కడే ఉన్న వెంకట్రామ్​రెడ్డి వారిని రక్షించే క్రమంలో రసాయన వాయువులు పీల్చి అస్వస్థతకు గురయ్యాడు.