25వ అంతస్తు నుంచి పడిన ట్విన్స్‌‌ మృతి

V6 Velugu Posted on Oct 18, 2021

ఘజియాబాద్: క్షణాల తేడాతోనే కలిసి పుట్టిన అన్నదమ్ములు.. అంతే తేడాతో ఒకరితర్వాత ఒకరు ప్రాణాలు కోల్పోయారు. కవలలిద్దరూ తొమ్మిదో తరగతి చదువుతున్నారు. యూపీలోని ఘజియాబాద్​లో ఈ విషాదం జరిగింది. సిద్ధార్థ్​ విహార్​లోని అపార్ట్​మెంట్ కాంప్లెక్స్​లో నివాసం ఉంటున్న 14 ఏండ్ల కవలలు సత్యనారాయణ్, సూర్యనారాయణ్ శనివారం రాత్రి ఒంటి గంట ప్రాంతంలో బిల్డింగ్​లోని 25వ అంతస్తు నుంచి కిందపడిపోయారని పోలీసులు తెలిపారు. పిల్లలిద్దరూ ఆడుకుంటూ ప్రమాదవశాత్తు జారిపడి ఉంటారని, బిల్డింగ్​లోని సీసీ టీవీ ఫుటేజీలను స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. వాళ్ల డెడ్​బాడీలను పోస్ట్ మార్టానికి తరలించి కేసు ఫైల్ చేశామన్నారు. చిన్నారుల తండ్రి ఆఫీస్ పనిమీద ముంబైలో ఉన్నారని, అపార్ట్​మెంట్​లో తల్లి, సోదరి ఉన్నట్లు పోలీసులు చెప్పారు. ‘‘పిల్లలు ఇద్దరూ అర్ధరాత్రి 12 గంటల టైంలో బాల్కనీలో ఆడుకున్నారు. త్వరగా పడుకోవాలని చెప్తూ నేను ఇంట్లోకి వెళ్లిన కొద్దిసేపటికే ఏదో చప్పుడు వినిపించింది. బయటికి వచ్చే చూసేసరికి పిల్లలిద్దరూ కిందపడిపోయి కనిపించారు’ అని కవలల తల్లి చెప్పినట్లు పోలీసులు తెలిపారు.

Tagged death, UP, Ghaziabad, Twins Fall, 25th Floor

Latest Videos

Subscribe Now

More News