పురుగుల మందు తాగించినా బతికిన కవలలు

పురుగుల మందు తాగించినా బతికిన కవలలు

22 రోజుల ట్రీట్మెంట్​ తర్వాత డిశ్చార్జ్

మహబూబ్​నగర్, వెలుగు: ఆడపిల్లలు పుట్టడంతో అదేరోజు కన్నతండ్రే కవలలకు పురుగుల మందు తాగించాడు. 22 రోజులు హాస్పిటల్​లో ట్రీట్మెంట్​పొందిన చిన్నారులు ఎట్టకేలకు కోలుకున్నారు. మహబూబ్​నగర్​జిల్లా గండీడ్ మండలం దేశాయపల్లి గ్రామానికి చెందిన కేశవులు, కృష్ణవేణి దంపతులకు తొలికాన్పులో  పాప పుట్టింది. రెండో కాన్పు కోసం నారాయణపేట జిల్లా కోస్గిలోని ప్రైవేట్​ హాస్పిటల్​లో ఈ నెల 1న జాయిన్​ చేశారు. అదే రోజు కృష్ణవేణి ఇద్దరు కవలలకు జన్మనిచ్చింది. మళ్లీ ఆడపిల్లలు పుట్టడంతో తండ్రి హాస్పిటల్​లో ఉన్న ఇద్దరు పిల్లలకు రాత్రి ఎవరూ చూడనప్పుడు పాలకు బదులు పురుగుల మందు తాగించాడు. పిల్లల నోటి నుంచి నురగ రావడం చూసిన సిబ్బంది ఆరా తీయగా తానే ఈ పనికి పాల్పడ్డట్టు కేశవులు ఒప్పుకున్నాడు. కేశవులుపై హత్యాయత్నం కేసు నమోదు చేసిన కోస్గి పోలీసులు ఈ నెల 3న రిమాండ్​కు తరలించారు. చిన్నారుల పరిస్థితి విషమంగా ఉండడంతో ఈ నెల 4న మహబూబ్​నగర్​లోని ప్రైవేట్​హాస్పిటల్​కు తీసుకెళ్లారు.

హాస్పిటల్ ​నుంచి డిశ్చార్జి

డాక్టర్లు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడంతో చిన్నారులు క్రమంగా కోలుకున్నారు. పిల్లల సంరక్షణ బాధ్యతలను చాలెంజ్​గా తీసుకుని ట్రీట్మెంట్​అందించినట్లు రవి చిల్డ్రన్​హాస్పిటల్​డాక్టర్​శేఖర్​నాయక్​ చెప్పారు. మంగళవారం చిన్నారులను డిశ్చార్జి చేశారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ హాస్పిటల్​కు వెళ్లి చిన్నారులను చూశారు. తండ్రి జైలులో ఉండడంతో పిల్లల బాగోగులు చూసుకోవాలని జిల్లా ఆఫీసర్లకు సూచించారు. చిన్నారుల చదువుకు సహకరిస్తామని చెప్పారు.

For More News..

పోలీసులు కేసు దర్యాప్తు చేస్తలేరని.. మృతుని బంధువులు

తండ్రి పురుగుల మందు తాగించినా.. కవలలు బతికిన్రు

సస్పెన్షన్​ ఎత్తేసే వరకూ బాయ్‌కాట్