కొత్త ఫీచర్ తీసుకొచ్చిన ట్విట్టర్

కొత్త ఫీచర్ తీసుకొచ్చిన ట్విట్టర్

ట్విట్టర్ లో కొత్త ఫీచర్ తీసుకొస్తున్నట్లు ట్విట్టర్ సీఈఓ ఎలన్ మస్క్ ప్రకటించాడు. ఇది వరకు ట్వీట్ ని ఎంతమంది లైక్, షేర్ చేశారు, ఎన్ని కామెంట్స్ వచ్చాయన్న విషయాలు తెలిసేవి. కానీ ఎంత మంది ట్వీట్ ను చూశారన్న లెక్క తెలిసేది కాదు. అయితే, ఇకపై ఆ సంఖ్యను చూపించేలా ట్విట్టర్ లో కొత్త ఫీచర్ అందుబాటులోకి తెచ్చారు. వ్యూస్ సింబల్ రూపంలో ఇది కనిపించనుంది. లైక్, షేర్, కామెంట్స్ ఐకాన్స్ పక్కన వ్యూస్ సింబల్ ని చేర్చనున్నారు. 

కొత్త ఫీచర్ అందుబాటులోకి వస్తే ట్వీట్ ను ఎంతమంది చూశారు, ఎంత మందికి సమాచారం రీచ్ అయిందన్న విషయాలు తెలుస్తాయి. వ్యూస్ సింబర్ తో ఒక ట్వీట్ ను 90 శాతం మంది చూస్తే, కేవలం పది శాతం మంది మాత్రమే లైక్ షేర్, కామెంట్ చేస్తున్నారన్న విషయం తెలిసింది.