కరోనా సెకండ్ వేవ్ తో తీవ్ర ఇబ్బందులు పడుతున్న భారత్‌కు వివిధ దేశాలతో పాటు పలు సంస్థలు కూడా సాయం అందిస్తున్నాయి. సోషల్ మీడియా సంస్థ ట్విట్టర్ కూడా తన సాయాన్ని ప్రకటించింది. కరోనాపై పోరులో భాగంగా తన వంతు సాయంగా రూ. 15 మిలియన్ డాలర్లు (రూ. 110 కోట్లు) ఆర్థిక సాయం ప్రకటించింది. ఈ విషయాన్ని ట్విట్టర్ CEO జాక్ పాట్రిక్ డోర్సే ట్విట్టర్ ద్వారా తెలిపారు. ఈ మొత్తాన్ని మూడు స్వచ్ఛంద సంస్థలు కేర్, ఎయిడ్ ఇండియా, సేవా ఇంటర్నేషనల్ యుఎస్‌ఎలకు అందజేయనున్నట్లు చెప్పారు. వీటిలో కేర్‌కు 10 మిలియన్ల డాలర్లను అందిస్తుండగా, ఎయిడ్ ఇండియా, సేవా సంస్థలకు రూ.2.5 మిలియన్ల చొప్పున అందిస్తున్నారు జాక్.
