భారత్ కు ట్విట్టర్ భారీ విరాళం

భారత్ కు  ట్విట్టర్ భారీ విరాళం

కరోనా సెకండ్ వేవ్ తో ఇబ్బందులు ఎదుర్కొంటున్న భారత్ కు అండగా ఉండేందుకు ముందుకు వచ్చింది మైక్రో బ్లాగింగ్ దిగ్గజం ట్విట్టర్. ఇందులో భాగంగా కరోనాపై పోరాటానికి తన వంతుగా 15 మిలియన్ డాలర్లు(దాదాపు110 కోట్లు) డొనేట్ చేస్తున్నట్లు ప్రకటించారు ట్విట్టర్ సీఈవో జాక్ పాట్రిక్. ఈ మొత్తం మూడు నాన్-గవర్నమెంటల్ ఆర్గనైజేషన్ కు అందిస్తున్నట్లు ట్వీట్ చేశారు. కేర్, ఎయిడ్ ఇండియా, సేవా USA సంస్థలకు ఈ మొత్తం అందుతుందని చెప్పారు. కేర్ సంస్థకు పది మిలియన్ డాలర్లు, ఎయిడ్ ఇండియా, సేవా USA సంస్థలకు చెరో 2.5 మిలియన్  డాలర్లు అందనున్నాయి.