ట్విట్టర్లో లాగిన్‌ ప్రాబ్లెం

ట్విట్టర్లో లాగిన్‌ ప్రాబ్లెం

మైక్రో బ్లాగింగ్ ప్లాట్‌ఫామ్ ట్విట్టర్ మరోసారి డౌన్ అయింది. ట్విట్టర్ లో ఎర్రర్ మెసేజ్ కనిపించి.. ఆ తరువాత ఆటోమెటిక్ గా లాగ్ అవుట్ అవడం యూజర్లకు కాసేపు చికాకు పుట్టించింది. దీంతో వినియోగదారులు అసహనం వ్యక్తం చేశారు. అయితే ఎలాన్ మస్క్ ట్విట్టర్ కొనుగోలు చేసిన తర్వాత.. సైట్ డౌన్ కావడం ఇది మూడోసారి. ఆటోమెటిక్ గా లాగ్ అవుట్ అయిన తర్వాత.. ‘‘సంథింగ్ వెంట్ రాంగ్, బట్ డోంట్ వర్రీ.. ఇట్స్ నాట్ యువర్ ఫాల్ట్, లెట్స్ ట్రై అగైన్’’ అంటూ మెసేజ్ కనిపించింది. మళ్లీ ప్రయత్నించినా వినియోగదారులు ట్విట్టర్ లోకి లాగిన్ కాలేకపోయారు.

ఈ సమస్య ఢిల్లీ, నాగ్‌పూర్, ముంబై, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, కోల్‌కతాతో సహా పలు నగరాల్లోనూ వెలుగు చూసిందని ‘డౌన్‌డెక్టర్’ వెబ్‌సైట్ వెల్లడించింది. యూజర్లు పలుమార్లు రిఫ్రెష్ చేసినా లాగిన్ కాకపోవడంతో అసంతృప్తి వ్యక్తం చేశారు. డెస్క్ టాప్ తో పాటు మొబైల్ వినియోగదారులు కూడా ఈ సమస్యను ఎదుర్కొన్నట్టు తెలుస్తోంది.