Twitter Layoffs : ట్విట్టర్ ఉద్యోగులకు మళ్లీ ఝలక్

Twitter Layoffs : ట్విట్టర్ ఉద్యోగులకు మళ్లీ ఝలక్

ఎలన్ మస్క్ ట్విట్టర్ ను కొనుగోలు చేయడం ఆ సంస్థ ఉద్యోగుల పాలిట శాపంగా మారింది. టాప్ లెవల్ నుంచి కింది స్థాయి వరకు ట్విట్టర్ లే ఆఫ్ ల ప్రక్రియ కొనసాగుతోంది. ఈ క్రమంలో మరికొంతమందికి మస్క్ షాక్ ఇచ్చాడు. ముందస్తు నోటీసులు ఇవ్వకుండా ఉద్యోగుల్ని తొలగించాడు. ఇంజినీరింగ్, ప్రాడక్ట్ విభాగాలతో పాటు బ్లూ టిక్ ఇంచార్జ్ ను కూడా తొలగించాడు. 

ఉద్యోగాలనుంచి తొలగించినట్లు కొందరికి ఈ మెయిల్స్ వచ్చాయని, మరికొంతమందికి ఇంటర్నల్ సిస్టమ్ లాగిన్ కాలేదని కొంతమంది ఉద్యోగులు తెలిపారు. లేఆఫ్ లో కంపెనీ ఎగ్జిక్యూటివ్ ఎస్తర్ క్రాఫోర్డ్ కూడా ఉన్నాడు. ఈ లే ఆఫ్ ద్వారా దాదాపు 200 మందిని ఉద్యోగాలనుంచి తొలగించినట్లు సమాచారం.