ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టీ20లో ఇండియా ప్లేయింగ్ 11 ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఆస్ట్రేలియా లాంటి బౌన్సీ వికెట్ ఉన్న పిచ్ పై ఇద్దరు స్పెషలిస్ట్ స్పిన్నర్లతో మన జట్టు బరిలోకి దిగింది. మిస్టర్ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తితో పాటు లెఫ్ట్ హ్యాండ్ స్పిన్నర్ కుల్దీప్ కు చోటు దక్కింది. మరో స్పిన్నర్ అక్షర్ పటేల్ కూడా జట్టులో ఉన్నాడు. ఆడుతుంది ఆస్ట్రేలియాలో అయినా భారత జట్టు మాత్రం ముగ్గురు స్పిన్నర్లను కొనసాగించడం చర్చనీయాంశంగా మారుతోంది. ఆసియా కప్ లో ఉపఖండపు పిచ్ లు కావడంతో ముగ్గురు స్పిన్నర్లలను ఆడించడంలో అర్ధం ఉంది. కానీ ఫాస్ట్ బౌలింగ్ కు అనుకూలించే ఆసీస్ గడ్డపై ముగ్గురు స్పిన్నర్లు అవసరం లేదు.
ముగ్గురు స్పిన్నర్ల వ్యూహాన్ని పక్కన పెడితే అంతకంటే షాకింగ్ న్యూస్ మరొకటి ఉంది. అదేంటో కాదు ఫాస్ట్ బౌలర్ అర్షదీప్ సింగ్ కు తుది జట్టులో స్థానం ఇవ్వకుండా హర్షిత్ రానాకు చోటు కల్పించారు. ఈ నిర్ణయం చాలామంది క్రికెట్ ఫ్యాన్స్ కు షాక్ ఇచ్చింది. అర్షదీప్ టీ20ల్లో అరంగేట్రం చేసినప్పటి నుంచి నిలకడగా రాణించడంతో పాటు ఇండియా తరపున పొట్టి ఫార్మాట్ లో టాప్ వికెట్ టేకర్. మరోవైపు హర్షిత్ రానాకు పెద్దగా అంతర్జాతీయ అనుభవం లేదు. అయినప్పటికీ అర్షదీప్ ను పక్కనపెట్టి హర్షిత్ కు ఛాన్స్ ఇవ్వడంతో నెటిజన్స్ టీమిండియా హెడ్ కోచ్ గంభీర్ పై విమర్శల వర్షం కురిపిస్తున్నారు.
గంభీర్ కారణంగానే హర్షిత్ రానా జట్టులో కొనసాగుతున్నాడని ఫైరవుతున్నారు. అర్షదీప్ సింగ్ కు బ్యాటింగ్ నేర్చుకోవాలని కొంతమంది సలహాలు ఇస్తున్నారు. టాప్ వికెట్ టేకర్ కు జట్టులో ప్లేస్ లేకపోవడం విచారకరం అని కామెంట్స్ చేస్తున్నారు. ఈ మ్యాచ్ లో హర్షిత్ రానా రాణించకపోతే గంభీర్ ను ట్రోల్ చేయడం ఖాయంగా కనిపిస్తుంది. ప్రస్తుతం జరుగుతున్న మ్యాచ్ విషయానికి వస్తే టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేస్తున్న ఇండియా ప్రస్తుతం 9.4 ఓవర్లలో వికెట్ నష్టానికి 97 పరుగులు చేసింది. ఈ దశలో వర్షం కారణంగా మ్యాచ్ ఆగిపోయింది. వర్షం కారణంగా మ్యాచ్ ను 18 ఓవర్లకు కుదించారు. క్రీజ్ లో గిల్ (37), సూర్య కుమార్ యాదవ్ (39) ఉన్నారు. అభిషేక్ శర్మ (19) విఫలమయ్యాడు.
