హైదరాబాద్ సిటీ, వెలుగు: హైదరాబాద్ జిల్లాలోని అన్ని ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థల్లో జర్నలిస్టుల పిల్లలకు 2026–-27 విద్యాసంవత్సరానికి సంబంధించి ఫీజులో 50 శాతం రాయితీ ఇవ్వాలని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్(టీడబ్ల్యూజేఎఫ్) హైదరాబాద్ జిల్లా కమిటీ ప్రతినిధులు కోరారు.
ఈ మేరకు మంగళవారం కలెక్టర్ ప్రియాంక ఆలను కలిసి వినతి పత్రం అందించారు. ప్రస్తుతం జిల్లాలో అనేక మంది జర్నలిస్టులు చాలీచాలని వేతనాలతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు.
ప్రైవేట్ స్కూళ్లలో పిల్లల ఫీజులు కట్టలేకపోతున్నారని పేర్కొన్నారు. ఫెడరేషన్ జిల్లా కన్వీనర్ వి.రవికుమార్, కో-కన్వీనర్లు ఆర్.శ్రీనివాస్ గౌడ్, ఎం.రవికుమార్, పి.సంతోష్ కుమార్, అడ్వైజర్గోవింద్ నాయక్, వ్యవస్థాపక అధ్యక్షుడు మామిడి సోమయ్య ఉన్నారు. అనంతరం హైదరాబాద్ డీఈవో యాదయ్యను కలిసి వినతిపత్రం అందజేశారు.
