2.5 లక్షల మంది పిల్లలు ప్రభుత్వ స్కూళ్లలో చేరారు

2.5 లక్షల మంది పిల్లలు ప్రభుత్వ స్కూళ్లలో చేరారు
  • ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేయడంతోనే మార్పు సాధ్యమైంది
  • 70ఏళ్లలో ఏ రాజకీయ పార్టీ చేయలేని మార్పు చేసి చూపించాం: కేజ్రివాల్

న్యూఢిల్లీ: విద్యా వ్యవస్థలో 70 ఏళ్లలో ఏ రాజకీయ పార్టీ చేయలేని మార్పు  తాము చేసి చూపించామన్నారు ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్. ఐదేళ్లలో ఢిల్లీలో రెండున్నర లక్షల మంది పిల్లలు ప్రైవేటు స్కూళ్లు వదిలేసి.. ప్రభుత్వ స్కూళ్లలో చేరారని ఆయన తెలిపారు. తాము ఎంతో శ్రద్ధగా  ప్రభుత్వ స్కూళ్లను అభివృద్ధి చేయడం వల్లే ఇది సాధ్యమైందన్నారు. గత ప్రభుత్వాలు ప్రజలను పేదలుగానే ఉంచాలని చూశాయని.. ఓటు బ్యాంకు రాజకీయాలతో  విద్యా వ్యవస్థను పట్టించుకోలేదని ఆరోపించారు. ఢిల్లీలో జరిగిన కాయస్త సమాజ్ మహా సమ్మేళన్ లో సీఎం కేజ్రివాల్ పాల్గొని మాట్లాడారు.

 

ఇవి కూడా చదవండి

వరి వేయొద్దంటున్నారు.. ఏ పంట వేయాలో అర్థం కావడం లేదు

ఎంబీబీఎస్ విద్యార్థిని ఆత్మహత్య

కడప దర్గా ఉర్సు ఉత్సాల్లో పాల్గొన్న ఏఆర్ రెహమాన్

బుక్స్​ బోరింగ్ కాదు.. అలవాటయితే అమృతమే..