వరి వద్దంటున్నారు.. ఏ పంట వేయాలో అర్థం కావడం లేదు

వరి వద్దంటున్నారు.. ఏ పంట వేయాలో అర్థం కావడం లేదు
  • షర్మిలకు కష్టాలు చెప్పుకున్న గ్రామస్థులు

మెదక్ జిల్లా: రైతు ఆవేదన యాత్రలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షురాలు వైఎస్ షర్మిలకు కష్టాలు చెప్పుకున్నారు కంచన్ పల్లి గ్రామస్థులు. కేసీఆర్ వరి వేస్తే ఉరే అంటుంటే ఏ పంట వెయ్యాలో అర్థం కావడం లేదని వాపోయారు. మక్కలు, శనగలు వేద్దామంటే కోతుల బాధ ఎక్కువ ఉందని చెప్పారు. తమ ఊళ్లో వరి తప్ప వేరే పంటలు పండవన్నారు. వరి వద్దనేందుకేనా కాళేశ్వరం కట్టిందని ప్రశ్నించారు. కాళేశ్వరం నీళ్లు తెచ్చి ఎవరి నెత్తిన పోస్తారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులు ఆవేదనను సావధానంగా విన్నారు షర్మిల.

 

 

ఇవి కూడా చదవండి

ఎంబీబీఎస్ విద్యార్థిని ఆత్మహత్య

సరదాగా ఈతకు వెళ్లి ముగ్గురు విద్యార్థుల గల్లంతు

కడప దర్గా ఉర్సు ఉత్సాల్లో పాల్గొన్న ఏఆర్ రెహమాన్

బుక్స్​ బోరింగ్ కాదు.. అలవాటయితే అమృతమే..