ఈతకు వెళ్లి ముగ్గురు విద్యార్థుల గల్లంతు

ఈతకు వెళ్లి ముగ్గురు విద్యార్థుల గల్లంతు
  • స్వర్ణముఖి నదిలో ముగ్గురు విద్యార్థుల గల్లంతు

చిత్తూరు జిల్లా: రేణిగుంట మండలం జీవి పాలెం గ్రామ సమీపంలో స్వర్ణముఖి నదిలో ముగ్గురు విద్యార్థులు గల్లంతయ్యారు. ఆదివారం సెలవు రోజు కావడంతో సరదాగా ఈతకు వెళ్లి నీట మునిగిపోయారు. జీవీ పాలెంకు చెందిన  తొమ్మిది, పదో తరగతి చదువుతున్న ధోని (16), గణేష్ (15), యుగంధర్ (14) లిఖిత్ సాయి స్నేహితులు. దళితవాడకు చెందిన నలుగురు విద్యార్థులు తొమ్మిది. పదో తరగతి చదువుతున్నారు. స్వర్ణముఖి నది జి పాలెం వంకలో సరదాగా ఈత కొట్టడానికి వెళ్లి గల్లంతయ్యారు. గల్లంతైన వారిలో లిఖిత్ ను గ్రామ ప్రజలు ప్రాణాలతో కాపాడారు. 
ప్రమాదం గురించి తెలిసిన వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని గల్లంతైన విద్యార్థుల కోసం గాలింపు చేపట్టారు. 
ప్రమాదం గురించి మంత్రి, ఎమ్మెల్యేల ఆరా
స్వర్ణముఖి నదిలో నలుగురు పిల్లలు గల్లంతు ఘటనపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి ఆరా తీశారు. గల్లంతైన పిల్లలను కాపాడేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని మంత్రి పెద్దిరెడ్డి జిల్లా కలెక్టర్ ను ఆదేశించారు. ఇప్పటికే ఒక పిల్లాడు క్షేమంగా బయటపడ్డట్టు అధికారులు మంత్రికి తెలియజేశారు. 

 

ఇవి కూడా చదవండి

 

కడప దర్గా ఉర్సు ఉత్సాల్లో పాల్గొన్న ఏఆర్ రెహమాన్

బుక్స్​ బోరింగ్ కాదు.. అలవాటయితే అమృతమే..