కోహెడలో పాస్ బుక్కులు ఇప్పిస్తామని మోసం

కోహెడలో పాస్ బుక్కులు ఇప్పిస్తామని మోసం
  • ఇద్దరు వ్యక్తులు రిమాండ్ 

కోహెడ, వెలుగు: పాస్ బుక్కులు ఇప్పిస్తామని నమ్మించి డబ్బులు తీసుకుని మోసం చేసిన ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసినట్లు ఎస్ఐ అభిలాష్ తెలిపారు. ఆయన వివరాల ప్రకారం.. కోహెడ కు చెందిన  గడ్డం చంద్రమౌళి, రేవోజు కనకయ్యకు పట్టా పాస్ బుక్కులు ఇప్పిస్తామని కొండపాక మండలం దుద్దెడకు చెందిన పిన్నింటి శ్రీహరి, పల్లె యాదగిరి ఏడాది కింద  డబ్బులు తీసుకున్నారు.

 రైతులు పాస్ బుక్కుల కోసం అడిగితే రేపు, మాపు అంటూ దాట వేశారు. విసుగు చెందిన రైతులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించినట్లు ఎస్ఐ చెప్పారు.