ఔరంగబాద్కు గంజాయి సప్లయ్

 ఔరంగబాద్కు గంజాయి సప్లయ్
  • దోమల్​గూడలో ఇద్దరు అరెస్టు

బషీర్​బాగ్, వెలుగు: మహారాష్ట్ర ఔరంగబాద్ కు గంజాయి తరలిస్తున్న ఓ మహిళతో పాటు యువకుడిని హైదరాబాద్ దోమల్ గూడ పోలీసులు అరెస్ట్ చేశారు. బషీర్ బాగ్ లోని సెంట్రల్ జోన్ డీసీపీ కార్యాలయంలో డీసీపీ శిల్పవల్లి వివరాలను వెల్లడించారు. మహారాష్ట్ర ఔరంగబాద్ కు చెందిన కోమల్ సోమినాథ్(23) వరుసకు కొడుకు అయ్యే సాహిల్ మహేశ్​సాలుంకే(18)తో కలిసి గంజాయి వ్యాపారం చేస్తోంది. 

విజయవాడలో బాబు అనే వ్యక్తి నుంచి రూ.4.5 లక్షలు విలువ చేసే 18 కేజీల గంజాయిని కొన్నది. సాలుంకేతో కలిసి మహారాష్ట్ర ఔరంగబాద్​లో విక్రయించేందుకు సిద్ధం కాగా, వీరిద్దరు మంగళవారం ఉదయం లిబర్టీ చౌరస్తాలో పోలీసులకు పట్టుబడ్డారు.