రాష్ట్రానికి రెండు రోజులు వర్ష సూచన

రాష్ట్రానికి రెండు రోజులు వర్ష సూచన

రాష్ట్రంలో రానున్న రెండు రోజుల్లో వర్షాలు పడుతాయని వాతావరణశాఖ వెల్లడించింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని తెలిపింది. పగటి ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉన్న సాయంత్రానికి వాతావరణం చల్లబడుతుందన్నారు. 2,3 రోజుల్లో రుతుపవనాలు కేరళలోకి ప్రవేశించే అవకాశం ఉందని సూచించారు. హైదరాబాద్ తో పాటు పలు జిల్లాల్లో చిరు జల్లుల నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. వికారాబాద్, నల్గొండ జిల్లాలో ఉరుములు, మెరుపులతో  వర్షాలు పడే చాన్స్ ఉందని చెప్పారు వాతావరణ శాఖ అధికారులు. ఇంకో 2 రోజులపాటు పగటి  ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదైనా సాయత్రం వాతావరణం చల్లబడుతుందని వాతావరణ శాఖ అధికారి నాగరత్న తెలిపారు.

ఉత్తర ఇంటీరియర్ కర్ణాటక నుండి దక్షిణ తమిళనాడు వరకు ఉన్న ఉత్తర - దక్షిణ ద్రోణి బలహీన పడిందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. దీని ప్రభావంతో రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడుతాయని సూచించారు. రేపు, ఎల్లుండి రాష్ట్రంలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని, గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందన్నారు. పశ్చిమ దిశ నుండి రాష్ట్రము వైపుకి బలమైన గాలులు వీస్తున్నట్లు వాతావరణ శాఖ అధికారి నాగరత్న తెలిపారు. నైరుతి రుతుపవనాలు దక్షిణ అరేబియా సముద్రంలోని కొన్ని ప్రాంతాల్లోకి  ప్రవేశించి, కొమోరిన్ ప్రాంతంలో ముందుకు సాగుతున్నాయన్నారు. రాబోయే 2-3 రోజుల్లో కేరళలో రుతుపవనాలు ప్రవేశించడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయన్నారు.

మరిన్ని వార్తల కోసం

సర్కారు దవాఖానల్లో సౌలతులు లేక పేషెంట్ల ఇబ్బందులు


మున్సిపల్ చైర్ పర్సన్తో రాజీనామా చేయించిన కౌన్సిలర్లు