రెడ్ సీర్ రిపోర్ట్ : 2 రోజుల్లో రూ.24 వేల కోట్ల సేల్స్..కస్టమర్ల నుంచి 9 కోట్ల ఆర్డర్లు..ఫోన్ల వాటాయే 40 శాతం

రెడ్ సీర్ రిపోర్ట్ : 2  రోజుల్లో రూ.24 వేల కోట్ల సేల్స్..కస్టమర్ల నుంచి 9 కోట్ల ఆర్డర్లు..ఫోన్ల వాటాయే 40 శాతం
  • ఈ-కామర్స్ సంస్థల రికార్డు వ్యాపారం

న్యూఢిల్లీ:ఈ-–కామర్స్ సంస్థలు పండుగ సీజన్ సేల్స్ మొదటి రెండు రోజుల్లోనే సుమారు రూ.24 వేల కోట్ల విలువైన వస్తువులను విక్రయించినట్లు రెడ్​సీర్ స్ట్రాటజీ కన్సల్టెంట్స్ తెలిపింది. అమెజాన్, ఫ్లిప్​కార్ట్, మీషో, అజియో వంటి ప్రముఖ ప్లాట్​ఫామ్స్ ద్వారా వినియోగదారులు దాదాపు 8 నుంచి 9 కోట్ల ఆర్డర్లు ఇచ్చారు. 

మొత్తం విక్రయాల్లో మొబైల్ ఫోన్లు అత్యధికంగా 38 నుంచి 40 శాతం వాటాను కైవసం చేసుకుని రూ.9,100 కోట్ల నుంచి రూ.9,600 కోట్ల వ్యాపారాన్ని సాధించాయి. కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తులు 25 నుంచి 27 శాతం వాటాతో రూ.6,000 కోట్ల వ్యాపారం సాధించాయి.

 ఫ్యాషన్ విభాగం వాటా 18 శాతం ఉంది. మొదటి రెండు రోజుల్లో 6 నుంచి 6.5 కోట్ల మంది ఆర్డర్లు ఇచ్చారు. క్విక్ కామర్స్ ప్లాట్​ఫామ్స్ విక్రయాలు కూడా సాధారణ రోజుల కంటే 4–5 రెట్లు పెరిగాయి.