సన్ సిటీలో శుభప్రదం మాల్ ప్రారంభం

సన్ సిటీలో శుభప్రదం మాల్ ప్రారంభం

హైదరాబాద్​, వెలుగు: శుభప్రదం ఫ్యామిలీ మాల్ షోరూమ్ ఆదివారం హైదరాబాద్ సన్​సిటీలో ప్రారంభమైంది.  నటీమణులు ఐశ్వర్య రాజేష్, మానస వారణాసి ముఖ్య అతిథులుగా వచ్చి సందడి చేశారు. దీంతో మాల్​ కిక్కిరిసిపోయింది.  కుటుంబంలోని ప్రతి ఒక్కరికి అవసరమైన సంప్రదాయ, ఆధునిక దుస్తుల  కలెక్షన్స్ అందుబాటులో ఇక్కడ ఉంటాయి. 

 ప్రత్యేక డిజైన్లు, రంగులు, స్టైల్స్​తో దుస్తులు అందిస్తున్నామని మాల్​ మేనేజ్​మెంట్​ తెలిపింది.  పెళ్లిళ్ల వంటి ప్రత్యేక వేడుకల దుస్తులనూ కొనుగోలు చేయవచ్చని పేర్కొంది. పండుగల సందర్భంగా ప్రత్యేక ఆఫర్లు తీసుకువచ్చామని, అన్ని వయసుల వారికి అనువైన లేటెస్ట్​ ట్రెండ్స్​ను తక్కువ ధరలకే అందిస్తున్నామని పేర్కొంది.