సిరిసిల్ల జేఎన్టీయూను త్వరగా పూర్తి చేయండి ..సీఎం రేవంత్ రెడ్డికి కేటీఆర్ విజ్ఞప్తి

సిరిసిల్ల జేఎన్టీయూను త్వరగా పూర్తి చేయండి ..సీఎం రేవంత్ రెడ్డికి కేటీఆర్ విజ్ఞప్తి

హైదరాబాద్, వెలుగు: రాజన్న సిరిసిల్ల జిల్లాలోని జేఎన్టీయూ ఇంజినీరింగ్ కాలేజీ స్టూడెంట్ల సమస్యలను పరిష్కరించాలని సీఎం రేవంత్​ రెడ్డిని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కోరారు. కళాశాల శాశ్వత క్యాంపస్ నిర్మాణాన్ని పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని ఆదివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. 2021లో రూ.402 కోట్ల పరిపాలనా అనుమతులతో మంజూరైన జేఎన్టీయూ ఇంజినీరింగ్ కాలేజీ శాశ్వత క్యాంపస్ నిర్మాణం ఇప్పటికీ పెండింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఉందని కేటీఆర్ తెలిపారు.

మంధేపల్లి గ్రామంలో 20 ఎకరాల భూమిని కేటాయించినప్పటికీ, నిర్మాణ పనులు ప్రారంభం కాకపోవడంతో కాలేజీని ప్రస్తుతం అగ్రహారంలోని డిగ్రీ కాలేజ్ క్యాంపస్‌‌‌‌‌‌‌‌లో తాత్కాలికంగా కొనసాగిస్తున్నారని చెప్పారు. మంధేపల్లిలో కేటాయించిన స్థలంలో శాశ్వత క్యాంపస్ నిర్మాణానికి అవసరమైన నిధులు మంజూరు చేసి పనులను వేగవంతం చేయాలని, కొత్త క్యాంపస్ పూర్తయ్యే వరకు కాలేజీని ప్రస్తుత ప్రాంగణంలోనే కొనసాగించేందుకు అనుమతించాలని కేటీఆర్ కోరారు.