
సిద్దిపేటలో రోడ్డు ప్రమాదం జరిగింది. పట్టణ సమీపంలోని పొన్నాల పెట్రోల్ బంక్ వద్ద హైవేపై అంబులెన్స్, డీసీఎం ఢీ కొంది. శనివారం తెల్లవారుజామున జరిగిన ఈ ప్రమాదంలో ఇద్దరు మహిళలు మృతి చెందగా మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు గాయలైన వారిని ఆస్పత్రికి తరలించారు.