పూణే పోర్షే కారు యాక్సిడెంట్ కేసులో ఇద్దరు డాక్టర్లు అరెస్ట్

పూణే పోర్షే కారు యాక్సిడెంట్ కేసులో ఇద్దరు డాక్టర్లు అరెస్ట్

ఎలాగో డబ్బు ఉందని తప్పు చేసి తప్పించుకోవాలని చూస్తున్న ఓ సంపన్న కుటుంబం బాగోతం బట్టబయలు అయ్యింది. గత వారం రోజులుగా పూణే పోర్షే కారు యాక్సిడెంట్ కేసు ఎన్నో మలుపులు తిరుగుతోంది. ఈ కేసులో సినిమాలో కంటే ఎక్కువ ట్విస్టులు ఉన్నాయి. సోమవారం ఈ కేసులో నిందితుని బ్లడ్ శాంపిల్స్ తారుమారు చేసినందుకు ఇద్దరు డాక్టర్లను అరెస్ట్ చేసినట్లు పూణే పోలీసులు తెలిపారు. బాగా డబ్బున్న ఓ బిజినెస్ మ్యాన్ కొడుకు. అతనికి 17ఏళ్లు.. ఫుల్ గా మద్యం తాగి శనివారం అర్థరాత్రి బైక్ పై వెళ్తున్న ఓ జంటను కారుపై స్పీడ్ గా వచ్చి ఢికొట్టాడు. 

ఈ యాక్సిడెంట్ లో ఇద్దరు బాధితులు అక్కడికక్కడే మరణించారు. ఆ సమయంలో కారు మైనర్ బాలుడు నడపలేదన్నట్టు క్రియేట్ చేయడానికి బాలుడి తండ్రి విశాల్ అగర్వాల్, తాత సురేంద్ర అగర్వాల్ ప్రయత్నించారు. డ్రైవర్ ను ఒప్పుకోమని బలవంతం పెట్టారు. అంతేకాదు మైనర్ బాలుడు డ్రింక్ చేశాడా అని చేసే టెస్ట్ లో ఇద్దరు డాక్టర్లతో కలిసి బ్లడ్ శాంపిల్స్ తారుమారు చేశారు. కానీ, మైనర్ బాలుడు మద్యం తాగినట్లు, 200 స్పీడ్ లో కారు డ్రైవ్ చేసినట్లు సీసీపుటేజ్ లో రికార్డ్ అయ్యింది. విషయం బయటకు తెలిసి సాసూన్ జనరల్ హాస్పిటల్ కు చెందిన ఇద్దరు డాక్టర్లు అరెస్ట్ చేశారు.