హైదరాబాద్ లో ఇద్దరు డ్రగ్ పెడ్లర్లు అరెస్టు ... 11 గ్రాముల ఎండీఎంఏ స్వాధీనం

హైదరాబాద్ లో ఇద్దరు డ్రగ్ పెడ్లర్లు అరెస్టు ... 11 గ్రాముల ఎండీఎంఏ స్వాధీనం

హైదరాబాద్ సిటీ, వెలుగు: హైదరాబాద్ నార్కోటిక్ ఎన్‌‌‌‌ఫోర్స్‌‌‌‌మెంట్ వింగ్, టోలిచౌకి పోలీసులు ఆకస్మిక ఆపరేషన్‌‌‌‌ నిర్వహించి ఇద్దరు డగ్ర్ పెడ్లర్లను అరెస్టు చేశారు. వారి నుంచి 11 గ్రాముల ఎండీఎంఏ, రెండు మొబైల్ ఫోన్లు, ఒక టూ-వీలర్  స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ రూ.1.77 లక్షలు ఉంటుందని టాస్క్ ఫోర్స్, హెచ్​న్యూ  డీసీపీ  వై.వి.ఎస్. సుధీంద్ర తెలిపారు. 

మహ్మద్​ఇమ్రాన్ కారు డ్రైవర్ గా పని చేస్తూ సన్​సిటీలో ఉంటున్నాడు. ఇతడు గంజాయి, హాష్ ఆయిల్‌‌‌‌కు బానిసై 2024లో డ్రగ్ పెడ్లింగ్‌‌‌‌ ప్రారంభించాడు. నాంపల్లి పోలీసులకు పట్టుబడి జైలుకు వెళ్లి వచ్చాడు. తర్వాత బెంగళూరులో డ్రగ్ వాడుతున్న వారితో సంబంధాలు ఏర్పరచుకుని, స్థానిక పెడ్లర్ల నుంచి ఎండీఎంఏ, ఎల్ఎస్​డీ బ్లాస్ట్​లను తీసుకువచ్చి ఇక్కడ అమ్ముతున్నాడు. 2024 చివరలో కంచన్​బాగ్​పోలీసులకు పట్టుబడ్డాడు. 

2025 మార్చిలో విడుదలైన తర్వాత బెంగళూరు నుంచి ఎండీఎంఏ తెచ్చి మళ్లీ నగరంలో అమ్మడం మొదలుపెట్టాడు. షేక్​బషీర్​అహ్మద్ అలియాస్​సమీర్​ఇంటర్​మధ్యలో ఆపి దుబాయ్‌‌‌‌లో రెండేండ్లు సేల్స్‌‌‌‌మెన్​గా పని చేసి 2016లో  తిరిగి వచ్చాడు. 

హుమాయున్ నగర్ లో ఉంటున్నాడు. తర్వాత మద్యం, ఎండీఎంఏకు  బానిసయ్యాడు. తర్వాత పెడ్లర్​గా మారి డ్రగ్స్​అమ్మడం మొదలుపెట్టాడు. ఇమ్రాన్, సమీర్​ఇద్దరూ కలిసి డ్రగ్స్​దందా చేస్తుండడంతో విశ్వసనీయ సమాచారం మేరకు హెచ్​న్యూ, టోలిచౌకి పోలీసులు బుధవారం పట్టుకున్నారు.