తగ్గేదెలే: ఉత్తరాఖండ్‍లో రెండు ఏనుగుల ఘర్షణ

తగ్గేదెలే: ఉత్తరాఖండ్‍లో రెండు ఏనుగుల ఘర్షణ

సాధారణంగా కోడిపుంజులు.. పొట్టేళ్లు కొట్టుకోవడం చూస్తాం. తమ ఏరియాలోకి కొత్తవి వస్తే కుక్కలు కూడా కొట్లాడుతుంటాయి. కానీ అడవుల్లో ఏనుగులు కలబడటం చాలా అరుదు. ఉత్తరాఖండ్ హరిద్వార్ లో రెండు ఏనుగులు కొట్టుకున్న వీడియో ఇప్పుడు వైరల్ అయింది. కొమ్ములు విరిగేంతలా పోట్లాడాయి.. రెండు ఏనుగులు. అడవి నుంచి కొట్లాడుతూ ఊళ్లోకి చేరినా పంతం ఆపలేదు. అడవుల్లో ఆదిపత్యం కోసం.. ఏనుగుల మధ్య ఇలాంటి కొట్లాటలు సహజమే అంటున్నారు అధికారులు. హరిద్వార్ లో ఏనుగుల కొట్లాటలో.. ఒకదాని దంతం విరిగిందని.. దాన్ని రేంజ్ కార్యాలయంలో ఉంచామన్నారు DFO.

మరిన్ని వార్తల కోసం  :-

ఫోర్టిఫైడ్ రైస్ టెస్టింగ్ కోసం రిసోర్స్​ సెంటర్లు

భారీగా పెరుగుతున్న వెహికల్స్