పిల్లి కోసం కొట్టుకున్న రెండు ఫ్యామిలీలు

పిల్లి కోసం కొట్టుకున్న రెండు ఫ్యామిలీలు

హుజూర్‌నగర్‌, వెలుగు: పిల్లి కోసం రెండు ఫ్యామిలీలు కొట్టుకున్నాయి. ఒకరిపై మరొ కరు చేయి చేసుకోవడంతో గొడవ పోలీస్​స్టేషన్​​ చేరింది. సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌లోని గణేశ్ నగర్ కాలనీకి చెందిన మద్దెల మున్నా, ఇతడి తల్లి ముత్యాలు పెండ్లిళ్లకు మండపాలు కడుతూ అన్‌ సీజన్‌లో స్టీల్‌ సామాన్ల వ్యాపారం చేస్తుంటారు.  మూడేండ్ల కింద మైసూర్‌  వెళ్లినప్పుడు ఓ బ్రీడ్​కు చెందిన రెం డు పిల్లులను రూ. 5 వేల చొప్పున కొన్నారు. ఇందులో ఒకటి చనిపోగా, మరో పిల్లి ఏడాది నుంచి కనిపించడం లేదు. ఇటీవల ఫణిగిరి గుట్ట వద్ద జాతరలో పిల్లి కనిపించగా ఓ వ్యక్తి మున్నాకు సమాచారం ఇచ్చాడు. దీంతో మున్నా కుటుంబసభ్యులతో కలిసి పిల్లిని పెంచుకుంటున్న బాణోతు చుక్కమ్మ దగ్గరకు వెళ్లాడు. తమ పిల్లిని ఇవ్వాలని కోరాడు. దీంతో రెండు కుటుంబాల మధ్య మాటామాటా పెరిగి ఒకరిపై ఒకరు చేయి చేసుకున్నారు. చివరకు పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి కంప్లయింట్​ చేసుకున్నారు. పోలీసులు పిల్లి యజమాని మద్దెల మున్నాకు బాణోతు చుక్కమ్మ రూ. 5 వేలు ఇచ్చేలా రాజీ కుదిర్చారు.