ఈ సిగరెట్లు అమ్ముతున్న ఇద్దరు అరెస్ట్.. 3 లక్షల విలువైన 22  సిగరెట్లు స్వాధీనం

ఈ సిగరెట్లు అమ్ముతున్న ఇద్దరు అరెస్ట్.. 3 లక్షల విలువైన 22  సిగరెట్లు స్వాధీనం

గచ్చిబౌలి, వెలుగు : స్టూడెంట్లు, ఐటీ ఎంప్లాయీస్ టార్గెట్ గా నిషేధిత ఎలక్ట్రానిక్ సిగరెట్లను అమ్ముతున్న ఇద్దరిని రాయదుర్గం పోలీసులు అరెస్ట్ చేశారు. బేగంపేటకు చెందిన భారతం రాధా మాధవ్(19) శంకర్ పల్లిలోని ఐబీఎస్ కాలేజీలో చదువుతున్నాడు. గతంలో ఈ– సిగరెట్లను ఆన్ లైన్​లో కొన్న మాధవ్ దాన్ని వ్యాపారంగా మార్చుకున్నాడు. కోల్​కతాకు చెందిన దీప్, యష్, ముంబయికి చెందిన తేజ్​కు వాట్సాప్​లో ఆర్డర్లు పెడుతున్నాడు.

వారు కొరియర్ల ద్వారా ఈ– సిగరెట్లను పంపేవారు. మాధవ్ వాటిని సిటీలోని కాలేజీ స్టూడెంట్లకు, ఐటీ ఎంప్లాయీస్​కు అమ్మేవాడు. ఇప్పటివరకు పంజాగుట్ట ఆమిటీ, శంకర్​ల్లిలోని ఇన్ఫాయ్ కాలేజీ, బాచుపల్లిలోని మహీంద్రా, కొండాపూర్ సంస్కృతి కాలేజీ, షేక్​పేటలోని ఆకాష్ ఇనిస్టిట్యూట్, పటాన్ చెరులోని గీతం కాలేజీలకు చెందిన 63 మంది స్టూడెంట్లకు అమ్మాడు. మాధవ్ వద్ద ఈ – సిగరెట్లను కొన్న పంజాగుట్ట ఆమిటీ బిజినెస్ స్కూల్​కు చెందిన రాకేశ్(21) సైతం వాటిని పలువురికి అమ్మడం మొదలుపెట్టాడు. ఆ తర్వాత మాధవ్, రాకేశ్ కలిసి కోల్​కతా నుంచి భారీగా ఈ– సిగరెట్లను తెప్పించి 71 మంది సాఫ్ట్ వేర్ ఎంప్లాయీస్, స్టూడెంట్లకు అమ్మారు.

దీనిగురించి సమాచారం అందుకున్న మాదాపూర్ జోన్ ఎస్​వోటీ పోలీసులు మాధవ్, రాకేశ్​ను గురువారం అదుపులోకి తీసుకున్నారు. వారి దగ్గరి నుంచి రూ.3 లక్షల విలువైన 22 ఎలక్ట్రానిక్ సిగరెట్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను రిమాండ్​కు తరలించారు. దీప్​, యష్, తేజ్ పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.