రాజస్థాన్లో కూలిన ఫైటర్ జెట్.. ఇద్దరు పైలెట్లు మృతి

రాజస్థాన్లో కూలిన ఫైటర్ జెట్.. ఇద్దరు పైలెట్లు మృతి
  • సూరత్​గఢ్ఎయిర్​బేస్ నుంచి టేకాఫ్
  • విచారణకు ఆదేశించిన ఇండియన్ ఎయిర్​ఫోర్స్

న్యూఢిల్లీ: ఇండియన్ ఎయిర్​ఫోర్స్​కు చెందిన జాగ్వార్ ఫైటర్ జెట్.. రాజస్థాన్ చురు జిల్లాలోని భనుడా గ్రామ సమీపంలో బుధవారం మధ్యాహ్నం కుప్పకూలింది. ఈ ఘటనలో ఇద్దరు పైలెట్లు చనిపోయారు. ఇదొక ట్రైనింగ్ ఫైటర్ జెట్. సూరత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గఢ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎయిర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బేస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నుంచి టేకాఫ్ అయింది. తర్వాత గాల్లో ఉండగానే ఫైటర్ జెట్ నుంచి పొగలు వచ్చాయని స్థానికులు తెలిపారు. ఆకాశంలోనే పెద్ద శబ్ధంతో పేలుడు సంభవించిందని, తర్వాత క్షణాల వ్యవధిలోనే నేలను తాకిందని చెప్పారు.

ఫైటర్ జెట్ కూలిన వెంటనే లోకల్ పోలీసులు, ఆర్మీ అధికారులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. యుద్ధ విమానానికి సంబంధించిన పార్ట్స్ అన్నీ చెల్లాచెదురుగా పడిపోయాయి. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రమాదంపై ఇండియన్ ఎయిర్​ఫోర్స్ అధికారులు స్పందించారు. ఘటనపై విచారణకు ఆదేశించామన్నారు. ఇద్దరు పైలెట్ల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నామని తెలిపారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉందని చెప్పారు.

ఏడాదిలో మూడో ఘటన
జాగ్వార్ ఫైటర్ జెట్ కూలడం.. ఈ ఏడాదిలో ఇది మూడో సారి. మార్చి 17న హర్యానాలోని పంచకులలో, ఏప్రిల్ 2న గుజరాత్​లోని జామ్ నగర్​లో జాగ్వార్ ఫైటర్ జెట్లు కూలాయి. జాగ్వార్.. ట్విన్ ఇంజిన్ ఫైటర్ జెట్. సింగిల్, ట్విన్ సీట్ వేరియంట్​గా సేవలు అందిస్తున్నది. చాలా ఏండ్లుగా ఇండియన్ ఎయిర్​ఫోర్స్ జాగ్వార్ ఫైటర్ జెట్లను ఉపయోగిస్తున్నది. మన వద్ద సుమారు 120 జాగ్వార్​ ఫైటర్ పెట్లు ఉన్నాయి. ఇవన్నీ ఆరు స్క్వాడ్రాన్లలో సేవలు అందిస్తున్నాయి.