
- ఒకరు హైదరాబాదీ
- యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్‌లో చదువుతున్న స్టూడెంట్లు
అమెరికాలోని ఒక్లహోమాలో తీవ్ర విషాదం జరిగింది. వీకెండ్ ట్రిప్ కోసం వెళ్లిన ఇండియాకు చెందిన ఇద్దరు ఫ్రెండ్స్ ప్రమాదవశాత్తు నదిలో పడి చనిపోయారు. చనిపోయినవారిని కర్నాటక రాయచూర్ జిల్లాకు చెందిన అజయ్ కుమార్ కోయ్యలముడి (23), హైదరాబాద్‌కు చెందిన కౌశిక్ (22)గా గుర్తించారు. ఆస్టిన్‌లోని యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్‌లో చదువుతున్న ఈ ఇద్దరు వీకెండ్ ట్రిప్ కోసం ఒక్లహోమాకు వెళ్లారని, కౌశిక్ నీటిలో పడిపోతే అతడ్ని కాపాడే ప్రయత్నంలో అజయ్ కూడా నీటిలో మునిగి చనిపోయాడని అధికారులు చెప్పారు. ఇద్దరికీ ఈత రాదని, లైఫ్ జాకెట్లు కూడా వేసుకోలేదని వారు అన్నారు. బోస్టన్‌లో ఉంటున్న అజయ్ అక్క తేజస్విని అధికారులతో మాట్లాడి మృతదేహాలను సొంతూళ్లకు తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.