
ఈ ఏడాది వచ్చిన వీర సింహ రెడ్డి, భగవంత్ కేసరి సినిమాలతో వరుస బ్లాక్ బస్టర్లు అందుకున్న హీరో నందమూరి బాలకృష్ణ (Balakrishna) ప్రస్తుతం బాబి కొల్లి (Bobby Kolli) డైరెక్షన్ లో 109 వర్కింగ్ టైటిల్ తో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.. ఇటీవలే దేవర సినిమాతో ప్రాఫిట్స్ అందుకున్న సితార ఎంటెర్టైమెంట్ ఈ సినిమాని భారీ బడ్జెట్ తో.. క్వాలిటీ విషయంలో ఎక్కడా రాజీ పడకుండా తెరకెక్కిస్తున్నారు..
అయితే ఈ సినిమా షూట్ స్టార్ట్ చేసేరోజే రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన మేకర్స్. మరోసారి దసరా కానుకగా విడుదల చేసిన పోస్టర్ లో సంక్రాంతికి వస్తుందని స్పష్టం చేసారు .. ఈ సినిమాకి సంబధించి ఓ క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ..
అది ఏంటింటే ఈ మూవీకి రెండు టైటిల్స్ రెడీగా ఉన్నాయని అవి ఏంటింటే సర్కార్ సీతారాం (Sarkar sitaram), డాకు మహారాజ (Daku Maharaja) రెండు టైటిల్స్ లో ఏదో ఒకటి ఈ సినిమాకి పెట్టాలని మేకర్స్ భావిస్తున్నట్లు టాక్ .. టైటిల్ అండ్ టీజర్ ని దీపావళికి రిలీజ్ చేస్తారని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు..
టాలీవుడ్ లో ఈ సంక్రాంతికి మంచి రసవత్తమైన పోటీ ఉంటుందని తెలుస్తుంది.. డిసెంబర్ లో రావాల్సిన గేమ్ ఛేంజెర్ సంక్రాంతికి వాయిదా పడటంతో డిస్టిబ్యూటర్స్ లో టెన్షన్ వాతావరం నెలకొంది.. గేమ్ ఛేంజెర్ దెబ్బకి రిలీజ్ డేట్స్ అనోన్స్ చేసిన సినిమాలు ఇప్పుడు అయోమయంలో పడినట్లు తెలుస్తుంది..
ఈ చిత్రం లో విలిన్ గా బాలీవుడ్ యాక్టర్ బాబీ డియోల్ నటిస్తుండగా .. ముఖ్యమైన పాత్రలో చాందిని చౌదరి, ఊర్వశి రౌతేలా, నటిస్తున్నారు. ఈ మూవీ నుంచి వచ్చిన పోస్టర్స్ అండ్ గ్లింప్స్ సినిమాపై ఆకాశమే హద్దుగా అంచనాలు పెంచేసాయి.. ఈ మూవీతో మరోసారి ఇండస్ట్రీ రికార్డ్స్ బద్దలు కొట్టాలని ఫాన్స్ ఎదురు చూస్తున్నారు.