రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలి.. బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య డిమాండ్

రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలి..  బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య డిమాండ్

ముషీరాబాద్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం వెంటనే 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేయాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎంపీ ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. విద్యార్థి నిరుద్యోగుల సమస్యలపై ఈ నెల 24న జలవిహార్ లో నిరుద్యోగుల సదస్సు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 

బుధవారం విద్యానగర్ బీసీ భవన్ లో బీసీ సంక్షేమ సంఘం జాతీయ కన్వీనర్ గుజ్జ కృష్ణ, బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షులు వేముల రామకృష్ణ ఆధ్వర్యంలో జరిగిన సదస్సుకు ఆయన హాజరయ్యారు. నిరుద్యోగుల సదస్సు పోస్టర్​ను ఆవిష్కరించి మాట్లాడారు. రాష్ట్రంలో ఏడు సంవత్సరాల క్రితం ఏర్పడిన 23 కొత్త జిల్లాల్లో పూర్తిస్థాయి అధికారులను నియమించాలని డిమాండ్ చేశారు. 

చట్టపరంగా రిజర్వేషన్లు ఇవ్వాలి...

స్థానిక సంస్థల్లో 42 శాతం బీసీ రిజర్వేషన్లను పార్టీ పరంగా కాకుండా చట్టపరంగా ఇవ్వాలని ఆర్.కృష్ణయ్య కోరారు. బంద్ కు అన్ని వర్గాలు మద్దతునిచ్చాయని, ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లు తెరవాలన్నారు. కార్యక్రమంలో అంజి, అనంతయ్య, రవి, వెంకటేశ్​ తదితరులు పాల్గొన్నారు.