మీనాక్షి నటరాజన్‌కు సహాయకులుగా ఇద్దరు నేతల నియామకం

మీనాక్షి నటరాజన్‌కు  సహాయకులుగా  ఇద్దరు నేతల నియామకం

హైదరాబాద్, వెలుగు: ఏఐసీసీ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జీ మీనాక్షి నటరాజన్‌కు పార్టీ కార్యక్రమాల్లో సహాయపడేందుకు, రాష్ట్ర నేతలతో సమన్వయ పరిచేందుకు పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ ఇద్దరు సీనియర్ నేతలను నియమించారు. ఈ మేరకు శనివారం ఆయన మీడియాకు ఒక అధికారిక ప్రకటన విడుదల చేశారు. పీసీసీ ప్రధాన కార్యదర్శి ప్రవీణ్, కాంగ్రెస్ ఎన్నారై సెల్ కన్వీనర్ గోపాల్‌ను మీనాక్షి నటరాజన్‌కు సహాయకులుగా నియమించినట్టు ప్రకటించారు. ఈ ఇద్దరు నేతలు ఆమె రాష్ట్ర పర్యటనలు, పార్టీ కార్యక్రమాలు, సమావేశాల్లో సహాయంగా ఉంటూ, రాష్ట్ర నాయకులతో ఎప్పటికప్పుడు సమన్వయం చేస్తారని పీసీసీ పేర్కొంది.