ఒకే ఫ్రేమ్‌లో ఇద్దరు లెజెండ్స్.. ఎందుకంటే?

ఒకే ఫ్రేమ్‌లో ఇద్దరు లెజెండ్స్.. ఎందుకంటే?

ఇండియన్ స్టార్ క్రికెటర్..మిస్టర్ కూల్ ఎంఎస్ ధోనీ (MahendraSingh Dhoni), మ‌ల‌యాళ సూప‌ర్ స్టార్ మోహ‌న్‌లాల్ (Mohanlal ) వీరిద్దరూ ప్రేక్షకులకి థ్రిల్ ఇవ్వబోతున్నారు. లేటెస్ట్గా వీరు క‌లిసి ఉన్న ఓ ఫోటో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌  అవుతుంది. ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీ వారితో వరుస మీటింగ్స్లో కనిపిస్తోన్న ధోనీ..త్వరలో హీరోగా కనిపిస్తాడంటూ న్యూస్ వినిపిస్తోంది.

ఇప్పుడు మోహన్ లాల్తో షూట్లో పాల్గొనగా, ఏదైనా మల్టీస్టారర్ మూవీ అనుకునేరు..ఇది మూవీ కోసం కాదు. వీరిద్ద‌రు ఓ యాడ్ షూటింగ్‌లో పాల్గొన్న‌ట్లుగా సమాచారం. అయితే ఈ యాడ్ ఏంటనేది తెలియకపోయినప్పటికీ..రెడ్ టీ షర్ట్లో ధోనీ హెయిర్ స్టైల్ అదిరిపోయిందంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి. అలాగే మోహన్ లాల్ సింపుల్గా కనిపిస్తూ ఆకట్టుకుంటున్నారు. త్వరలో ఈ యాడ్కు సంబంధించిన ప్రోమో రిలీజ్ చేసే అవకాశం ఉంది.

రీసెంట్గా ధోనీ అమెరికా ట్రిప్కు వెళ్లగా..అక్క‌డ యూఎస్‌ ఓపెన్‌లో జరిగిన పురుషుల సింగిల్స్ క్వార్టర్-ఫైనల్‌ను వీక్షించాడు. అలాగే అమెరికా 45వ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో స‌ర‌దాగా గోల్ఫ్ ఆడిన విషయం తెలిసిందే.  ధోని ఎంటర్ టైన్ మెంట్స్ తో నిర్మాతగా మారి తెరకెక్కించిన ఫస్ట్ మూవీ LGM (Let’s Get Married). ఇవానా(Ivana), హరీష్ శంకర్(Harish shankar) జంటగా వచ్చిన ఈ సినిమాలో సీనియర్ నటి నదియా(Nadiya) కీలక పాత్ర పోషించారు.