మహారాష్ట్రలో ఇద్దరు మంత్రులకు కరోనా

మహారాష్ట్రలో ఇద్దరు మంత్రులకు కరోనా

మహారాష్ట్రలో కొత్త వేరియంట్ ఒమిక్రాన్‌ వ్యాప్తి కేసుల సంఖ్య పెరుగుతోంది. అసెంబ్లీ శీతాకాల సమావేశాలపై  కరోనా ఎఫెక్ట్ పడింది. డిసెంబరు 22న ప్రారంభమైన అసెంబ్లీ శీతాకాల సమావేశాలు మంగళవారంతో ముగిశాయి. మంత్రులతో పాటు పలువురు ఎమ్మెల్యేలు, పోలీసులు కరోనా బారిన పడ్డారు. 5 రోజుల పాటు జరిగిన ఈ సమావేశాల్లో సుమారు 50 కేసులు నమోదయ్యాయని రాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్‌ పవార్‌ తెలిపారు.

మహారాష్ట్ర విద్యాశాఖ మంత్రి వర్ష గైక్వాడ్‌, మరో మంత్రి కెసి పాడ్వి, బీజేపీ  ఎమ్మెల్యే సమీర్‌ మేఘేలకు వైరస్‌ పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. తనకు వైరస్‌ సోకిందని, స్వల్ప లక్షణాలు మాత్రమే ఉన్నాయని వర్ష గైక్వాడ్‌ తెలిపారు. ప్రస్తుతం ఐసోలేషన్‌లో ఉన్నానన్నారు. ఇటీవల తనను కలిసిన వారంతా జాగ్రత్తగా ఉండాలని, పరీక్షలు చేయించుకోవాలని కోరారు. అయితే సోమవారం వరకు ఆమె అసెంబ్లీ సమావేశాలకు హాజరైనట్లు అధికారులు తెలిపారు. వీరితో పాటు అసెంబ్లీలో పనిచేసే ప్రభుత్వ ఉద్యోగులు, అక్కడ భద్రతను పర్యవేక్షిస్తున్న పోలీసులకు కూడా కరోనా సోకింది. దీంతో అధికారులు అలర్ట్ అయ్యారు. కాంటాక్ట్‌ ట్రేసింగ్‌ చేపట్టి పరీక్షలు నిర్వహిస్తున్నారు అధికారులు. 

మరిన్ని వార్తల కోసం...

లీటర్ పెట్రోల్ ధర రూ.25 తగ్గింపు