మహారాష్ట్రలో మరో రెండు ఒమిక్రాన్‌ కేసులు

V6 Velugu Posted on Dec 06, 2021

  • ముంబయి మహానగరంలో వెలుగు చూసిన ఒమిక్రాన్

ముంబయి: దేశంలో కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసులు చాపకింద నీరులా పెరుగుతున్నాయి. తాజాగా ఇవాళ మహారాష్ట్రలో మరో రెండు ఒమిక్రాన్ కొత్త కేసులు నమోదయ్యాయి. అమెరికా నుంచి ముంబయికి వచ్చిన 36ఏళ్ల వ్యక్తితోపాటు దక్షిణాఫ్రికా దేశాల నుంచి వచ్చిన 37ఏళ్ల వయసున్న వ్యక్తికి ఒమిక్రాన్ వేరియంట్ నిర్ధారణ అయింది.  దీంతో మహారాష్ట్రలో ఒమిక్రాన్‌ కేసుల సంఖ్య పదికి చేరగా దేశంలో మొత్తం ఒమిక్రాన్‌ కేసుల సంఖ్య 23కి చేరింది. ఇప్పటి వరకు ముంబయి వెలుపల ఒమిక్రాన్‌ కేసులు నమోదు కాగా, నగరంలో ఈ వేరియంట్ నమోదు కావడం ఇదే మొదటిసారి. 

Tagged India, total, Maharashtra, cases, corona, Mumbai, COVID19, Country, new variant, omicron

Latest Videos

Subscribe Now

More News