పార్ట్ టైం జాబ్ పేరిట రూ.41 లక్షల సైబర్ మోసం

పార్ట్ టైం జాబ్ పేరిట రూ.41 లక్షల సైబర్ మోసం

రోజు రోజుకు సైబర్ మోసాలు పెరిగిపోతున్నాయి. సైబర్ నేరగాళ్లు కొత్త కొత్త మాస్టర్ ప్లాన్లతో అమాయకపు ప్రజల్ని  బుట్టలో పడేసుకుంటున్నారు. పోలీసులు సైబర్ క్రైమ్స్ పట్ల అవగాహన కల్పిస్తున్నా అంతకు అంత కేటుగాళ్లు రెచ్చిపోతున్నారు. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇద్దరు వ్యక్తులు సోషల్ మీడియాలో  ఓ ప్రకటన చూసి మోసపోయారు. పార్ట్ టైం జాబ్ పేరిట వచ్చిన లింకు ఓపెన్ చేసి వారి వివరాలు నింపారు. బాధితులు భవాని పురం కాలనీకి చెందిన ప్రైవేట్ ఉద్యోగి, స్వర్ణపురి కాలనీకి చెందిన లాయర్ వారి పేర్ల మీద ఐడి క్రియేట్ చేశారు. ఒకరు రూ.15 లక్షల 37 వేలు, మరొకరు రూ.25 లక్షల 71 వేలు పెట్టుబడి పెట్టారు. పెట్టుబడితో పాటు వచ్చిన లాభాలను డ్రా చేసుకొనె ప్రయత్నించగా ట్రేడింగ్ సంస్థ నుంచి ఎలాంటి రెస్పాన్స్ లేదు.  కంపెనీ  హ్యాండ్ ఇచ్చింది. మోసపోయామని గ్రహించిన బాధితులు స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అమీన్పుర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.