
నెల్లూరు: నెల్లూరు జిల్లా నాయుడు పేట రైల్వే స్టేషన్ సమీపంలో విషాదం జరిగింది. కదులుతున్న రైలులో మెట్ల మీద నుంచి జారిపడిపోబోతున్న ఓ వ్యక్తిని కాపాడబోయి మరో వ్యక్తి మరణించాడు. రైలు మెట్లపై కూర్చున్న యువకుల్లో ఒకరు పైకి లేవబోయి జారిపడగా, అతన్ని పట్టుకునే క్రమంలో మరో యువకుడు కూడా కిందపడి మృతి చెందాడు. తిరుచ్చి ఎక్స్‌ప్రెస్ రైల్లో మంగళవారం ఉదయం ఈ ప్రమాదం జరిగింది. వీరి మృతితో తోటి ప్రయాణికులు దిగ్భ్రాంతి చెందారు. రైల్వే పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.