ఎయిర్ పోర్టులోనే రెండు విమానాలు ఢీకొని పేలిపోయాయి..

ఎయిర్ పోర్టులోనే రెండు విమానాలు ఢీకొని పేలిపోయాయి..

అమెరికాలో నిన్న రెండు విమానాలు ఢీకొన్నాయి. ఈ ప్రమాదం అమెరికాలోని మోంటానా విమానాశ్రయంలో జరిగింది. విమానాశ్రయంలో ల్యాండ్ అవుతున్న విమానం ఆగి ఉన్న విమానాన్ని ఢీకొట్టిందని దింతో రెండు విమానాల్లో భారీ మంటలు చెలరేగి తీవ్ర గందరగోళం ఏర్పడింది. 

సమాచారం ప్రకారం, నలుగురు వ్యక్తులతో ప్రయాణిస్తున్న ఒక చిన్న సింగిల్ ఇంజిన్ విమానం (సొకాటా TBM 700 టర్బోప్రాప్) మధ్యాహ్నం 2 గంటల సమయంలో కాలిస్పెల్ సిటీ విమానాశ్రయంలో ల్యాండ్ కావడానికి ప్రయత్నించింది. అయితే ల్యాండింగ్ సమయంలో విమానాశ్రయంలో ఆగి ఉన్న  ఖాళీ విమానాన్ని ఒక్కసారిగా ఢీకొట్టింది. దింతో రెండు విమానాలు భారీ మంటల్లో చిక్కుకున్నాయి.  

పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో పైలట్ కంట్రోల్ కోల్పోయి రన్‌వేపైకి దూసుకెళ్లాడని, ఆ తర్వాత ఆగి ఉన్న విమానాన్ని ఢీకొట్టిందని,   మంటలు ఆర్పేలోపు గడ్డికి కూడా వ్యాపించాయని చెప్పారు.  ఈ చిన్న విమానాశ్రయం మోంటానాలో దాదాపు 30,000 మంది జనాభాతో  కాలిస్పెల్ నగరానికి దక్షిణంగా ఉంది. నేషనల్ ట్రాన్స్‌పోర్టేషన్ సేఫ్టీ బోర్డ్ ప్రకారం, ఈ విమానం వాషింగ్టన్‌లో నుండి  బయలుదేరింది.

 

ఒక విమానం కిందకు వచ్చి రన్‌వే చివర మరొక విమానాన్ని ఢీకొట్టిందని ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. అయితే ఈ ప్రమాదం నుండి పైలట్ సహా ముగ్గురు ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు, ఈ సంఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు. ఇద్దరు ప్రయాణికులకు స్వల్ప గాయాలు కాగా వారికీ విమానాశ్రయంలో చికిత్స అందించారు.