V6 News

మెదక్ జిల్లా లో చైల్డ్పోర్నోగ్రఫీ కేసులో ఇద్దరికి జైలు శిక్ష

మెదక్ జిల్లా లో చైల్డ్పోర్నోగ్రఫీ కేసులో ఇద్దరికి జైలు శిక్ష

మెదక్​ టౌన్​, వెలుగు : చైల్డ్ పోర్నోగ్రఫీ కేసులో ఇద్దరికి  ఏడాది జైలు శిక్షతో పాటు ఒక్కోక్కరికి రూ.7 వేల జరిమానా విధిస్తూ మెదక్​ జిల్లా ఫస్ట్​క్లాస్​ సెషన్స్​ జడ్జి శుభవల్లి తీర్పునిచ్చారని సోమవారం ఎస్పీ డీవీ శ్రీనివాస్​ రావు తెలిపారు. మహ్మద్ రిజ్వాన్, సాబీర్ మియా చైల్డ్ పోర్నోగ్రఫీ వీడియోలు, ఫొటోలను ఇతరులకు షేర్​చేసినట్లు విచారణలో తెలిందన్నారు. స్పందించిన షీ- టీమ్ సిబ్బంది ఇద్దరిని గుర్తించి అదుపులోకి తీసుకున్నారని వివరించారు. 

అనంతరం 14 మే 2022న తూప్రాన్ పీఎస్​లో అప్పటి ఎస్ఐ  యాదగిరిరెడ్డి కేసు నమోదు చేయగా ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ సీఐ శ్రీధర్ సమగ్ర దర్యాప్తు నిర్వహించి అవసరమైన సాక్షాలను సేకరించి కోర్టుకు సమర్పించినట్లు ఎస్పీ తెలిపారు. నిందితులైన మహ్మద్​ రిజ్వాన్​, సాబీర్​ మియాలపై ఆరోపణలు రుజువు కావడంతో జడ్జి జైలు శిక్షతో పాటు జరిమానా విధిస్తూ తీర్పునిచ్చారని ఎస్పీ వివరించారు.